తూర్పుగోదావరి

రాజమహేంద్రవరంలో సండే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: హ్యాపీ సండే పేరిట నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఆదివారం ఉదయం స్థానిక పుష్కరాలరేవులో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఎంపి ఎం మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కమిషనర్ వి విజయరామరాజు తదితరులు ఈకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, తీన్‌మార్, కోకో, కబడ్డీ, టగ్ ఆఫ్‌వార్, కోలాటం, తోలుబొమ్మలాట, కరెన్సీ నోట్ల ప్రదర్శన నిర్వహించారు. అలాగే ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ నగర పౌరులంతా సుఖసంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో యోగా, వంటల పోటీలను కూడా జరుపుతామన్నారు. కమిషనర్ విజయరామరాజు చొరవను ఆయన అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతీవారం హ్యాపీ సండే కార్యక్రమాలను ప్రజలే నిర్వహించుకోవాలన్నారు. కార్పొరేటర్లు ఇన్నమూరి రాంబాబు, గొర్రెల సురేష్, పితాని లక్ష్మీకుమారి, జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.