తూర్పుగోదావరి

నేతల ముందే బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 18: రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని బిజెపిలో వర్గపోరు భగ్గుమంది. ఇంతకాలం గుంభనంగా ఉన్న వైరివర్గాలు రచ్చకెక్కాయి. నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సాక్షిగా బాహాబాహీకి దిగారు. రాజమహేంద్రవరంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శుక్రవారం త్వరలో తాడేపల్లిగూడెంలో జరగనున్న అమిత్‌షా రైతు సభకు సంబంధించి సమీకరణపై నగర బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, పార్టీ నాయకులు పాలపాటి రవి పరిశీలకులుగా హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ హాజరయ్యారు. కొంతకాలంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రెండు వర్గాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. నగర బిజెపి అధ్యక్ష పదవి నియామకం విషయమై వారిరువురు ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. సభలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నగర బిజెపి కమిటీ నియామకం అనైతికంగా ఉందని, ఏ కార్యక్రమాలు తెలియజేయడంలేదని విమర్శలు గుప్పించారీరు. దీనితో సభలో ఉన్న తరుము వెంకటరావు మీరుచేసే కార్యక్రమాలు మాత్రం మాకు తెలుస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో సభ రసాభాసగా మారింది. మీడియా ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్ కలగజేసుకుంటూ ఎమ్మెల్యే వర్గంపై దూసుకెళ్లారు. తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బయటకు వెళ్లిపోయారు. ఆయన అనుచరులు కూడా వెళ్లిపోయారు. అనంతరం సభను సర్దుబాటుచేసి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం అర్బన్ కమిటీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు మాట్లాడుతూ అర్బన్ కమిటీని పూర్తిస్థాయిలో నియామకం చేసేందుకు కసరత్తు జరుగుతుందని, అందరికీ తెలిసే విధంగానే, ఏకపక్షంగా వ్యవహరించకుండా అందరినీ కలుపుకుని పనిచేస్తున్నానని వివరించారు. అర్బన్ కమిటీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఎమ్మెల్సీ సోము వర్గంగా ఉన్నారు. మొత్తం మీద బిజెపిలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు నేతల సమక్షంలోనే బహిర్గతమయ్యాయ.