తూర్పుగోదావరి

ప్రతిష్ఠాత్మకంగా అమిత్‌షా రైతు సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 18: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈనెల 26న జరగనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రైతు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేపట్టాయి. భారీస్థాయిలో జన సమీకరణకు కసరత్తు జరుగుతోంది. అమిత్ షా మీటింగ్ నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శుక్రవారం నగర బిజెపి అధ్యక్షుడు బొమ్ముల దత్తు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సభకు పరిశీలకులుగా హాజరైన ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు బిజెపికి పట్టున్న జిల్లాలని, అందరూ కలసి పని చేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ వల్ల ఎన్నో కేంద్ర పథకాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్రం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జనం వద్దకు విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీచేసే పరిస్థితి రావాలన్నారు. పదవులు కాదు పని చేయడం ముఖ్యమన్నారు. మోదీ వుంటేనే సంక్షేమం ఉంటుందని, భవిష్యత్తు అంతా బిజెపిదేనన్నారు. పదవులు పార్టీకి ఉపయోగకరంగా ఉండాలని, చిన్నచిన్న ఇబ్బందులున్నా సర్దుబాటు చేసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నారు. అర్బన్ అధ్యక్షుడు బొమ్ముల దత్తు మాట్లాడుతూ అమిత్‌షా సభకు కేడర్ ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం పలకాలన్నారు. తాను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగానే ఉంటానని స్పష్టం చేసినప్పటికీ పార్టీ నిర్ణయం మేరకు నగర అధ్యక్ష పదవిని తీసుకోక తప్పలేదని, అందరి అభిప్రాయాల మేరకు కమిటీని నియమించడం జరిగిందని వివరించారు. పూర్తిస్థాయి కమిటీకి కసరత్తు జరుగుతోందన్నారు. తాను బతికి ఉన్నంత కాలం పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తానని, పదవులు ముఖ్యం కాదని, చిత్తశుద్ధిగా పార్టీ కోసం పని చేయడమే తనకు తెలిసిన విషయమని ఉద్వేగభరితంగా అన్నారు. సమావేశంలో యెనుముల రంగబాబు, ఎన్‌ఎస్‌ఎస్ చంద్రశేఖర్, దార్వాడ రామకృష్ణ, చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. మహిళా కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యరు.