తూర్పుగోదావరి

బాగ్యనగర్ గ్యాస్ పైస్‌లైన్ నుండి గ్యాస్ లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, డిసెంబర్ 1: మండలంలోని సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపంలో భాగ్యనగర్ గ్యాస్ పైస్‌లైన్ లీక్ అవడంతో జనం బెంబేలేత్తిపోయారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో అటు అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడి చేశారు. హూటాహుటీన అగ్నిమాపక సిబ్బందిని రంగప్రవేశం చేయించారు. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సంఘటన స్థలం వద్దకు చేరి పరిశీలించారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ, ఆర్‌డిఓ అంబేద్కర్, తహశీల్దార్ సింహాద్రిలు చర్యలు చేపట్టారు. భాగ్యనగర్ సిబ్బంది రంగంలోకి దిగి లీక్‌ను అరికట్టగలిగారు. పెద్ద ప్రమాదం తప్పిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాసిరకం పైపుల వల్ల పక్కనే ఉన్న ఆయిల్ కంపెనీల పైపులతో కలిస్తే భారీ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జన చైతన్యయాత్రలకు విశేష స్పందన
పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి
అయినవిల్లి, డిసెంబర్ 1: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి గురువారం వరకు నిర్వహించిన జనచైతన్యయాత్రలకు ఆయా గ్రామాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అన్నారు. గురువారం అయినవిల్లి మండలంలోని కె జగన్నాథపురం, అయినవిల్లి, వెలవలపల్లి గ్రామాల్లో నిర్వహించిన జనచైతన్యయాత్రల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె జగన్నాథపురం సర్పంచ్ మోర్త వరలక్ష్మీసత్తిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల డ్వాక్రా సంఘాలకు రెండోవిడత రుణమాఫీ కింద ఒక్కొక్క సభ్యురాలి ఖాతాలో రూ.3వేలు చొప్పున జమచేయడం జరిగిందన్నారు. దీంతో వారికి 6000 రూపాయలు అందించగా మిగిళిన 4000 రూపాయలను త్వరలో వారి ఖాతాలోకి జమచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల రోజుల్లో జరిగిన జనచైతన్యయాత్రల్లో ఆయా గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీంటిని పూర్తిగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సలాది పుల్లయ్యనాయుడు, జడ్పీటీసీ గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ. పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్, తెలుగుయువత ఉపాధ్యక్షుడు పులపర్తి రవిబాబు, మాజీ జడ్పీటీసీ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, నేదునూరు నీటిసంఘం అధ్యక్షుడు ఇండుగుల వెంకట్రామయ్య, కల్లేపల్లి సుబ్బరాజు, గుమ్మడి వెంకటేశ్వరరావు, మట్టపర్తి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్ర కాపు జెఎసి సమావేశం: కాకినాడలో నేతలతో ముద్రగడ భేటీ!

కాకినాడ, డిసెంబరు 1: రాష్ట్ర కాపు జెఎసి సమావేశాన్ని జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని రమణయ్యపేటలో శుక్రవారం నిర్వహించనున్నారు. రమణయ్యపేటలో జెఎసి కన్వీనర్ వివై దాసు నివాసంలో జరిగే ఈ సమావేశానికి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరుకానున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేతలతో ముద్రగడ భేటీ కావడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశాలున్నట్టు జెఎసి నేత దాసు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. కాకినాడలో రాష్ట్ర జెఎసి సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి ముద్రగడ నగరంలోని పద్మనాభ ఫంక్షన్ హాలులో కొందరు నేతలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఇటీవల పాదయాత్ర నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న ముద్రగడ నాటకీయ పరిణామాల మధ్య యాత్రను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ముద్రగడ యాత్ర చేపట్టే అవకాశం కూడా లేకపోలేదని, ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కాపు జెఎసి సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఇంటెలిజన్స్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
నగదు రహిత లావాదేవీలకు సహకరించాలి : ఆర్డీవో గణేష్‌కుమార్

అమలాపురం, డిసెంబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నగదు రహిత లావాదేవీలకు ప్రజలు, వ్యాపారస్థులు సంపూర్ణ సహకారం అందించాలని అమలాపురం ఆర్డీవో జి గణేష్ కుమార్ అన్నారు. డివిజన్‌లోని అన్ని రేషన్ షాపుల్లో నగదురహిత లావాదీవీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్న డివిజన్‌లోని అమలాపురం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ పోలవరం, ముమ్మిడివరం తదితర మండలాల్లోని రేషన్ షాపులను గురువాం ఆర్డీవో పరిశీలించారు. ఇ-బడ్డీ యాప్ అందరూ వ్యాపారస్థులు తమ స్మార్ట్ఫోన్లలో ఇన్‌స్టాల్‌చేసుకుని, కొనుగోలుదారులు నగదు రహిత లావాదేవీలు చేసుకునేందుకు సహకరించాలన్నారు. ఈ నెలకి రేషన్ షాపుల్లో ఒక్కరూపాయి కూడా రుసుం తీసుకోకుండా వినియోగదారులకు రేషన్ ఇస్తామని, వచ్చే నెలలో డిసెంబర్, జనవరి నెలలకు కలిపి వసూలు చేస్తామని ఆర్డీవో తెలిపారు. రేషన్‌షాపుల్లో ఇ పోస్ మిషన్ ద్వారా రేషన్ అందజేస్తామని ఆర్డీవో తెలిపారు.
ఎయిడ్స్ పట్ల
అవగాహన అవసరం

అమలాపురం, డిసెంబర్ 1:ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అవగాహనతో వ్యవహరించాలని కిమ్స్ వైద్యకళాశాల డీన్ డాక్టర్ ఎఎస్ కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ వైద్యకళాశాలలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె వాణిమాధవి ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్‌పై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పోస్టల్ ప్రజంటేషన్ వ్యాసరచన, శ్లోగన్స్‌తో రోల్ ప్లే వంటి కార్యక్రమాలను నిర్వహించి అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వైద్యకళాశాల డీన్ కామేశ్వరరావు జెండా ఊపి ఈ ర్యాలీని నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవమైన హ్యాండ్స్ ఆఫ్ ఫర్ హెచ్‌ఐవి ప్రివెన్స్‌న్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జికెవి ప్రసాద్, ఆనందాచార్య, కిమ్స్ వైస్ చైర్మన్ ఎం మోహనరాజు, సిఇఓ రఘు, డాక్టర్ బి రంగారావు, సత్యనారాయణరాజు, డాక్టర్ శర్మ, డాక్టర్ పవన్, రవికుమార్, పాల్గొన్నారు.
అలాగే ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రామల్లో అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.