తూర్పుగోదావరి

‘నల్లనోట్ల’ మార్పిడికి బాసట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పెద్దనోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరు బ్యాంకర్లు బాసటగా నిలిచారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నోట్ల రద్దు, చిల్లర సమస్యల కారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలతో సహా వర్తకులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దనోట్లు రద్దు చేసి మూడు వారాలు గడుస్తున్నా సామాన్య, మధ్య తరగతి ప్రజల చేతికి సరిపడా డబ్బు అందలేదు. అయితే బ్యాంకర్లు, ధనికులపై మాత్రం పెద్దనోట్ల రద్దు ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. నల్లకుబేరులు బ్యాంకర్లతో కుమ్మక్కై తమ వద్ద ఉన్న పెద్దనోట్లన్నింటినీ మార్చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అదనుగా కొందరు బ్యాంకర్లు కూడా పెద్దనోట్ల మార్పిడి విషయంలో కమిషన్ వ్యాపారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ కొద్దిరోజుల క్రితం ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ పెద్దనోట్ల మార్పిడిలో బ్యాంకర్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని ప్రకటించడం గమనార్హం. అలాగే ఇటీవలే ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కూడా అర్బన్ ఎస్పీ బి రాజకుమారి కూడా పెద్దనోట్ల మార్పిడిలో బ్యాంకర్ల పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, ఈవిషయంలో సిబ్బంది పాత్ర ఉన్నట్లు అనుమానిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, వారితో పాటు పెద్దఎత్తున నగదు మార్పిడి చేసుకునే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడిన వెంటనే నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ఇతర సంస్థలు తమ సంస్థల్లో పనిచేసే వందలాది మంది సిబ్బందికి రూ.10వేల చొప్పున పెద్దనోట్లతో బ్యాంకులకు పంపి మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనికులకు పలు బ్యాంకుల్లో లాకర్లు ఉంటాయి. బ్యాంకర్లకు ప్రతీ ఏటా ఉండే డిపాజిట్ లక్ష్యాల సాధన కోసం ధనికులను మంచి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. పాతనోట్ల మార్పిడి సందర్భంగా ధనికులకు ఇది ఒక అవకాశంగా కనిపించింది. ఈవిధానంలో బ్యాంకర్ల కూడా లాభపడ్డారు. అందుకే ఏ బ్యాంకు, ఎటిఎం వద్ద నగరానికి చెందిన ఏ ప్రముఖుడు క్యూలో నిలుచుకున్న దాఖలాలు కనిపించలేదు. అయితే సామాన్యులకు మాత్రం ఇప్పటికీ కష్టాలు తప్పడం లేదు. జిల్లాకు భారీ ఎత్తున సుమారు రూ.135కోట్ల కరెన్సీ నోట్లు వచ్చినా గురువారం కూడా బ్యాంకులు, ఎటిఎంలలో నగదు కోసం ప్రజలు బారులుతీరారు. రూ. 2వేలు మినహా రూ.500 నోట్లు ఇప్పటికీ చెలామణిలోకి రాలేదు. అన్ని బ్యాంకుల్లోనూ రూ. 2000 నోట్లే పంపిణీ చేస్తున్నారు. దీంతో చిల్లర సమస్య తీవ్రంగా మారింది. మరోవైపు 1వ తేదీ వచ్చినా పెన్షనర్లు, ఉద్యోగులకు జీతాలు అందలేదు. గురువారం జీతాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు బ్యాంకుల ముందు నిరీక్షించినా ఫలితం లేకపోయింది. పెద్దనోట్ల రద్దు తరువాత సామాన్య, మధ్య తరగతి ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈకష్టాలు ఇప్పట్లో తీరేలా కూడా కనిపించడం లేదు.