తూర్పుగోదావరి

ఆట పాటలతో ఉర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 2: డోనార్స్‌క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన సినీ సంగీత దర్శకులు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తన మాట-ఆట-పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. మాట్లాడటానికి లేవగానే విద్యార్థులు, ప్రజాసమూహం నుండి పాట కావాలంటూ నినాదాలు చేయగా..ఏ పాట పాడమంటారని దేవిశ్రీ ప్రసాద్ అడిగారు. పలు పాటలు పాడాలంటూ వచ్చిన అభ్యర్థనల మేరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబిబిఎస్ చిత్రంలోని పాటను నృత్యం చేస్తూ పాడారు. అనంతరం రెండు మూడు పాటలు ఆలపించి, తరువాత మాట్లాడారు. తన తండ్రి, దివంగత సత్యమూర్తి డోనార్స్‌క్లబ్ ఏర్పాటుకు నామకరణం చేసిన విషయం తెలిసినవెంటనే.. ఆయన వర్ధంతి రోజున రామచంద్రపురంలో నిర్వహించే కార్యక్రమానికి రావాలని అనుకున్నట్లు తెలిపారు. తన తండ్రి ఆశయ సాధనలో కృతకృత్యులవుతున్న డోనార్స్‌క్లబ్‌కు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందుతుందని ఆయన స్పష్టం చేసారు. తన మేన బావ ఆచంట రాంబాబు ఇక్కడి పరిస్థితులను తనకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తారని సభాపూర్వకంగా తెలిపారు. డోనార్స్‌క్లబ్ నిర్వహణలో కృతకృత్యులవుతున్న తాడాల సత్యనారాయణ, తొగరు మూర్తి, నేదునూరి ప్రసాద్, చందమామ వాసు, ఎం శ్రీ్ధర్ రెడ్డిలతోపాటు జైన్ ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.