తూర్పుగోదావరి

ప్రభుత్వ పథకాల పేరిట మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 25: ఉద్యోగాలు, రైతులకు రుణాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి లక్షలాది రూపాయలు గుంజి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ బి రాజకుమారి ఈకేసు వివరాలను వెల్లడించారు. కోనసీమలోని మురముళ్లకు చెందిన సలాది రాంగోపాల్ అలియాస్ సుంకర శివరామ్ 2005 నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, విజయవాడల్లో రైతు మిత్ర సంఘం, ఆంధ్రా కిసాన్ సంఘం, చంద్రన్నబీమా, స్వచ్చ్భారత్ వంటి పథకాలను ఎరగా చూపించి అమాయాకులను కాంట్రాక్టులు, ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని బుట్టలో వేసుకునేవాడు. వారి నుంచి భారీగా సొమ్ములు గుంజి మాయమయ్యేవాడు. రాంగోపాల్‌పై వివిధ ప్రాంతాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. 2014 స్థానిక టూటౌన్ పరిధిలో రైతుమిత్ర ఫౌండేషన్ పేరిట నిరుద్యోగులు, రైతుల నుంచి రుణాలు, ఉద్యోగాల పేరిట రూ. 14.50లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. 2016లో ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చంద్రన్నబీమా అనే కార్యాలయాన్ని ప్రారంభించి ఫీల్డ్ ఆఫీసర్‌గా చెలామణి అవుతూ కారులో తిరిగాడు. దీపికా ట్రావెల్స్ ద్వారా కారును అద్దెకు తీసుకున్న రాంగోపాల్ రెండునెలల పాటు అద్దె చెల్లించి, ఆతరువాత కారుతో సహా పరారయ్యాడు. అప్పటి నుంచి రాంగోపాల్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు శుక్రవారం ఎవి అప్పారావురోడ్డులో నిర్వహించిన తనిఖీల సమయంలో పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి రెండుకార్లు, రెండు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు, 2లక్షల నగదు, 66 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. 20కేసుల్లో నిందితుడిగా ఉన్న రామ్‌గోపాల్ 12కేసుల్లో శిక్ష అనుభవించి, మళ్లీ సులువుగా డబ్బులు సంపాదించేందుకు మోసానే్న మార్గంగా ఎంచుకున్నాడని ఎస్పీ వివరించారు. ఈసమావేశంలో తూర్పు మండలం డిఎస్పీ రమేష్‌బాబు, సిఐ సిహెచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మొక్కజొన్న తోటలో పేలుడు పదార్థాలు స్వాధీనం
గోకవరం, మార్చి 25: మొక్కజొన్న తోటలో అనధికారంగా ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోకవరం ఎస్సై టి వెంకటసురేష్ కథనం ప్రకార మండలంలోని తంటికొండ గ్రామంలో విఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న పత్తి లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన కర్రిబండి వెంకట బాలకృష్ణకు చెందిన మొక్కజొన్న తోటలో గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన పేలుడు పదార్థాలను చూసిన వెంకటకృష్ణ ఈ విషయాన్ని విఆర్వో లచ్చిరెడ్డికి తెలిపారు. ఈ సమాచారం మేరకు విఆర్వో అక్కడకు వెళ్లి చూడగా తోటలో తెలుపు, ఆకుపచ్చ కల్గిన వైర్లు చివర్ల అల్యూమినియం గొట్టం కల్గి ఉంది. వాటిలో కొన్నింటికి పేపర్లు చుట్టి ఉన్నాయి. వాటిపై డేంజర్ అనే అక్షరాలు రాసి ఉండడంతో అవి పేలుడు పదార్థాలుగా గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు విఆర్వో లచ్చిరెడ్డి ఫిర్యాదుచేయడంతో 500 డిటోనేటర్లు కల్గిన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు అమర్చిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు.