తూర్పుగోదావరి

అర్ధ గంటలో అజెండా ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 15: వాడివేడిగా సాగిన రాజమహేంద్రవరం కౌన్సిల్ సాధారణ సమావేశంలో కేవలం అర్ధగంటలోనే అజెండాను ఆమోదించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆదాయ వనరులను పెంపొందించుకోవాల్సి వుందని మేయర్ పంతం రజనీ శేషసాయి పేర్కొన్నారు. సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ సమావేశానికి ముందుగా ఇటీవల మ తి చెందిన నిషిత్, మాజీ కార్పొరేటర్ ముత్యాలరెడ్డి మ తికి మేయర్, కౌన్సిల్ సంతాపంగా వౌనం పాటించారు. అనంతరం మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ ఖర్చు అధికంగా వుందని, కార్పొరేషన్ ఆదాయం తక్కువగా వుందని, ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. జాతీయ నదీ శుద్ధి పధకం ఫ్లాంట్ వద్ద మురుగు కాల్వలో చెత్త సేకరణకు కార్పొరేషన్ మెకానిక్ ఒక వినూత్న మిషనరీని రూపకల్పన చేశారని, దానిని మరింత మెరుగులు దిద్ది వినియోగించుకుంటే ఎనిమిది మంది మనుషులు చేసే పని ఒక మిషన్ ద్వారా చేయవచ్చని, అర గంటలో నాలుగు ట్రాక్టర్ల చెత్తను ఏరివేయవచ్చని మేయర్ వివరించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ లబ్ధిదారులు ఎంతో మంది వున్నారు.. ఇక రెండేళ్ళే పాలనా గడువు వుంది..కనీసం ఇప్పటికైనా సొంత ఇంటి కలలను నిజం చేద్దాం..కలలు కనమని చెప్పాం, లబ్ధిదారుల కలలు నిజం చేసేందుకు ప్రయత్నించాలని ఇళ్ళ స్కీమును కార్యాచరణ చేపట్టాలని చర్చించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ హౌసింగ్ పధకాలను వివరించారు. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇళ్ళు కట్టి ఇవ్వలేకపోవడం దురద ష్టకరమన్నారు. చిరు వ్యాపారులపై ఆశీల భారాన్ని తగ్గించాలని, ఆందోళన చేపట్టిన మున్సిపల్ వర్కర్ల సమస్యను మానవతా ద క్పదంతో చూసి పరిష్కరించాలని కోరారు. నగరపాలక సంస్థ పాఠశాలల్లో టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని, ఎంతో ప్రతిభ వుందని, రానున్న కాలంలో జాతీయ స్థాయిలో అన్ని పోటీ పరీక్షలే నిర్వహించనున్న నేపధ్యంలో నగరపాలక సంస్థ సిబి ఎస్ ఇ సిలబస్‌తో స్కూలు నిర్వహించాలని సూచించారు. ఆశీల పెనుభారాన్ని తగ్గించాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోరారు. రానున్న రెండేళ్లు అభివ ద్ధే పరమావధిగా వుండాలన్నారు. అనంతరం జరిగిన ప్రశ్న గంటలో కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వివిధ కార్పొరేషన్ల రుణాలు పెండింగ్‌లో పడుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ వివరణ ఇస్తూ మొత్తం 1715 రుణాలు లక్ష్యం కాగా 4500 దరఖాస్తులు వచ్చాయని, అందులో 1100 మందికి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, మరో 903 మందికి బడ్వాడా జరిగిందని, ఇంకా దాదాపు 800 వరకు ఇవ్వాల్సి వుందన్నారు. తమ వార్డులో కొత్తగా నిర్మించిన డ్రెయిన్ వల్ల మురుగునీరు ఇళ్ళల్లోకి వచ్చేస్తోందని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, డ్రెయిన్ లేనపుడు కంటే, డ్రెయిన్ నిర్మించిన తర్వాత తలెత్తిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు అనేక సార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్వతంత్ర కార్పొరేటర్ గొర్లె సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ విజయరామరాజు స్పందిస్తూ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామన్నారు. బిల్డింగ్ ప్లాన్‌లు ప్రజా ప్రతినిధులకు తెలియకుండా అడ్డదిడ్డంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇచ్చేస్తున్నారని డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ గందరగోళాన్ని నివ తి చేయాలని కోరారు. నగరంలో పలు చోట్ల సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేయాలని మేయర్ పంతం రజనీ శేషసాయి కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం కేవలం అర్ధగంటలో 15 అంశాల అజెండాను ఆమోదించారు.