తూర్పుగోదావరి

ఒకే అధికారి... రెండు జిల్లాల్లో ఉద్యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 21: విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒకే అధికారితో రెండు జిల్లాలో ఉద్యోగం చేయిస్తూ ఒక వైపు విద్యావ్యవస్థను, మరో వైపు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫైళ్లపై ఆ అధికారి సంతకాల కోసం అమలాపురం-ఏలూరు షటిల్ సర్వీసు చేయాల్సిందే. వివరాల్లోకి వెళితే.. అమలాపురం ఉప విద్యాశాఖాధికారిణిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ గంగాభవాణిని ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి విద్యా శాఖాధికారిణి (డిఇఒ)గా నియమించారు. అప్పటి నుండి ఆమె ఎక్కువ సమయం పశ్చిమగోదావరి జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె స్థానంలో అమలాపురంలో నేటికీ ఉప విద్యాశాఖాధికారిని నియమించలేదు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ పూర్తిగా కరువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అమలాపురం డివిజన్‌కు సంబంధించిన ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎవ్వరూ లేకపోడంతో ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అత్యవసరమైన ఫైల్‌పై ఉప విద్యా శాఖాధికారి సంతకం కావాల్సి వస్తే కార్యాలయంలో ఉన్న జూనియర్ అసిస్టెంట్, లేదా అటెండర్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారంలో ఒకటి లేదా రెండుసార్లు డివైఇఒ సంతకాల కోసం ఏలూరు వెళ్లాల్సి వస్తోందని కార్యాలయంలో పనిచేస్తోన్న సిబ్బంది వాపోతున్నారు. ముఖ్యంగా మెడికల్‌కు సంబంధించి అత్యవసర ఫైల్‌పై సంతకాల కోసం తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఉపాధ్యాయులు ఆంధ్రభూమి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

విజ్ఞాన కేంద్రంగా అంబేద్కర్ స్మారకం
*ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలను పురస్కరించుకుని రాజధాని విజయవాడలో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న 12.5 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ వెల్లడించారు. గురువారం ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో ఎస్సీ, ఎస్టీల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపనలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్మారకం వద్ద కమ్యూనిటీహాలు, లైబ్రరీ, పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. అక్టోబర్ 5న విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌పైన 4వ అంతస్తులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి, సత్వర న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీలకు త్వరితగతిన రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏఎస్‌డబ్ల్యూఓ కె డేవిడ్‌రాజు, ధనరాజు, తాళ్లూరి రాజేంద్రప్రసాద్, శ్యామ్, రమణ, ఎం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.