తూర్పుగోదావరి

మన్యంలో వాహనాల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జనవరి 21: మత్తుపదార్థాలను ఇతర జిల్లాల నుండి రాకుండా ఏజెన్సీ ప్రాంతమైన జడ్డంగి పోలీసు స్టేషన్ ఎదుట ఆదివారం పోలీసులు ఆకస్మికంగా వాహన తనిఖీ కార్యక్రమాన్ని చేబట్టారు. విశాఖ జిల్లా నుండి వస్తున్న వాహనాలల్లో గంజాయి, నాటుసారా రవాణా అవుతోందనే అనుమానంతో వాహనదారుల లగేజీని నిశితంగా పరిశీలించారు. రికార్డులు సక్రమంగాలేని 20 మంది వాహన చోదకుల వద్ద నుంచి రూ.2,400లు వసూలు చేశామని ఎస్సై వెంకటనాగార్జున వెల్లడించారు. వాహనాల తనిఖీ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రికార్డులు లేని అనేకమంది వాహనాలను రోడ్డు పొడవునా నిలిపివేశారు. తనిఖీ పూర్తయిన తర్వాత యధావిధిగా వాహనాలను విడిచిపెట్టారు.