తూర్పుగోదావరి

జొన్నాడ నుండి యానాం వరకు ఏటిగట్టు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఫిబ్రవరి 16: గౌతమీ గోదావరి నది ఎడమ వైపున ఉన్న ఏటిగట్టును పటిష్టపరచడమే కాకుండా బీటీ రహదారి ఏర్పాటుకు అవసరమైన సర్వే కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. ఇరిగేషన్‌కు సంబంధించిన ఏఈ ఈశ్వరమన్యం నేతృత్వంలో ఈ సర్వే కార్యక్రమం కోటిపల్లి వద్ద శుక్రవారం జరిగింది. గట్టు వెడల్పుతోపాటు బీటీ రహదారి నిర్మాణం వేసవి కాలంలోగా నిర్వహించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ టెండర్లు ఆమోదం అయిన వెంటనే ఈ కార్యక్రమం శరవేగంతో నడుస్తుందని ఏఈ ఈశ్వరమన్యం తెలిపారు.

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలి
రామచంద్రపురం, ఫిబ్రవరి 16: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ, మరిన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ మత్స్యకారుల సంఘ నాయకులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉమాభారతి, రాజనాథ్‌సింగ్, రాష్టప్రతి రామనాథ కోవిందులకు వినతిపత్రాలు అందించారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, బిజెపి నాయకులు కర్రి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే లింగో తదితరులు ఢిల్లీలో వారిని కలసి తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. మత్స్యకారుల కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని, జీఎస్‌పీసీ నుండి రావాల్సిన 18 నెలల నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయాలని, వేట నిషేధ సమయంలో బాధిత కుటుంబానికి రెండునెలలకు గాను 10 వేల రూపాయల పరిహారం అందించాలని వంద కేజీల బియ్యం ఇవ్వాలని ఆయా వినతి పత్రాలలో నాయకులకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు కర్రి చిట్టిబాబు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తాము ఇచ్చిన విజ్ఞాపన పత్రాలకు ఉమాభారతి, రాజనాథ్ సింగ్, రామనాథ కోవిందులు సానుకూలంగా వ్యవహరించారని తెలిపారు.

టీడీపీ, వైసీపీ బతుకుదెరువు రాజకీయాలు
*సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: టీడీపీ, వైసీపీ బతుకుదెరువు రాజకీయాలలను వదులుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హితవు పలికారు. సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా రాజమహేంద్రవరంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి గర్భశత్రువని ఆరోపించారు. రాష్ట్రంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను కొల్లగొట్టుకుని మోదీ బహుళజాతి సంస్థలకు దోచుకుపోతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లపాటు బీజేపీ చెప్పుల్లో కాళ్లెట్టుకుని తిరిగిన చంద్రబాబునాయుడు ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల చుట్టూ చంద్రబాబునాయుడు తిరిగే కంటే ప్రత్యేక హోదా కోసం కృషి చేసి ఉంటే అవే పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం చుట్టూ తిరిగేవన్నారు. రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో జరగనున్న సీపీఐ 24వ జిల్లా మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.