తూర్పుగోదావరి

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 29: రైతులు పండించిన పంటకు మద్దతుధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌లోని 16 మండలాల తహసీల్దార్లు, ఎంఎస్‌ఒలు, సొసైటీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది, ధాన్యం కొనుగోలుదారుల ఇన్‌చార్జిలతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అమలాపురం డివిజన్‌లోగల 16 మండలాల డివిజన్‌ల్లో మామిడికుదురు, పి గన్నవరం, రావులపాలెం కొనుగోలు కేంద్రాలు మినహా మిగిలిన కేంద్రాలలో కనీస ధాన్యాన్ని సేకరించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను జెసికి వివరించారు. బొండాలు, 1010 రకం ధాన్యం విరిగిపోయి దిగుబడి తక్కువ వస్తోందని, దీంతో వాటిని కొనేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదని వారు జెసికి వివరించారు. కోనసీమలో రెండు బాయిలర్లు రైస్ మిల్లులు ఉన్నాయని వాటి సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆ ధాన్యాన్ని కొనడం లేదని జెసి దృష్టికి కేంద్రాల నిర్వాహకులు తీసుకువచ్చారు. బొండాలు, 1010 ఎంత విస్తీర్ణంలో రైతు పండించారని జెసి ఆరా తీసారు. పంట దిగుబడి ఎక్కువుగా ఉండటంతో కోనసీమ ప్రాంతంలో రైతులు బొండాలు, 1010ని ఎక్కువ విస్తీర్ణంలో వేసారని పలువురు వివరిచారు. అయితే సామర్థ్యం ఎక్కువ ఉన్న బాయిలర్లను మిల్లులకు బొండాలు తరలించేందుకు ఏర్పాటు చేస్తామని జెసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 256 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం నాటికి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇది చాలా తక్కువ అన్నారు. రైతుకు అత్యధిక ప్రయోజనం చేకూర్చేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. రైతు వద్ద నుండి ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని సేకరించగలిగితే రైతుకు మేలు చేయడమే కాకుండా దాళారులు, మిల్లు యజమానులు కూడ ప్రభుత్వం నిర్థారించిన ధరకే కొనే అవకాశం ఉంటుందన్నారు. రైతు తాను పండించిన పంటను సొంత వాహనంలో కేంద్రానికి తరలిస్తే మద్దతు ధరకు మరో రూ.20లు అదనంగా చెల్లిస్తామనే ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని జెసి సూచించారు. డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రికార్డుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, విజిలెన్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఒకే రైతు పేరు మీద 7,8 సార్లు ధాన్యం కొనుగోలు చేసినట్లు తన పరిశీలనలో వెల్లడయిందన్నారు. అయితే ఆ రైతుకు ఎంత విస్తీర్ణంలో పొలం ఉంది, ఏ మేరకు ధాన్యాన్ని పండించాడనే పరిజ్ఞానం లేకుండా ఇన్‌చార్జిలు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో జి గణేష్‌కుమార్, పౌరుసరఫరాల శాఖ డిఎం ఎల్ కృష్ణారావు, డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
సరుకులన్నీ ఒకేసారి అందించాలి
రేషన్ షాపుల ద్వారా అందించే వస్తువులన్నింటినీ ఓకే సారి అందించాలని, బిల్లులు సక్రమంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఎంఎస్‌ఒలను ఆదేశించారు. మీఇంటికి మీరేషన్ కార్యక్రమాన్ని ఎవరైతే లేవలేని స్థితిలో ఉంటారో వారికి మాత్రమే అందించాలని సూచించారు. పదివేళ్ళల్లో ఏఒక్క వేలు ముద్ర పడినా వారికి రేషన్ సరుకు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే రేషన్ ముగింపు వివరాలను మే ఒకటికల్లా సమర్పించాలన్నారు. మీ ఇంటికే మీ భూమి కార్యక్రమం మే 3 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో 1బి పెండింగ్‌లపై ఆరా తీసారు.