తూర్పుగోదావరి

యువనేస్తం ఏర్పాటు పట్ల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, సెప్టెంబర్ 18: జనాభాలో అత్యధిక సంఖ్య కల్గిన యువత భవితను మెరుగుపర్చే సంకల్పంతో యువ నేస్తం పేరిట ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమరిన వీర్రాజు అధ్యక్షతన జరిగింది. నిరుద్యోగ భృతి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఉజ్వల కల్పన చేపట్టడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. విజ్ఞానాభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతో మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతున్న ముఖ్యమంత్రి చర్యలకు సమావేశం శుభాభినందనలు తెలిపింది. తెలుగువారి సంక్షేమానికి కృషిచేసే నేపథ్యంలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాబ్లీ ఆందోళనను బయటకు లాగి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ సమన్లు ఇప్పించిన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వ చర్యలను గర్హిస్తూ తీర్మానించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగిసిపడే ప్రమాదం ఉందని, దేశ వ్తాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేసినా కేంద్రం స్పందించకపోవటాన్ని సమావేశం నిరసించింది. రూ.2లు తగ్గించటం చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రిని అభినందించింది. ఈబీసీలు, ఆర్థిక స్వావలంభన కోసం ప్రవేశపెట్టిన రుణాలను సక్రమంగా ప్రజలకు అందించేలా కృషి జరగాలని అంటూ పెళ్లి కానుకను ఈబీసీలకు కూడా వర్తింపజేసిన ముఖ్యమంత్రి చర్యలను సమావేశం అభినందించింది. కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, జిల్లా ప్రజాపరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు, ఏవీవీవీఎస్ ప్రసాద్, ఆత్మ బ్లాక్ ఛైర్మన్ అల్లూరి దొరబాబు, తలాటం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పిహెచ్‌సిలు పరిశీలించిన సమన్వయకర్త
రామచంద్రపురం, సెప్టెంబర్ 18: కె గంగవరం మండలం కుందూరు, దంగేరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయ కర్త డాక్టర్ వానపల్లి వరప్రసాద్ మంగళవారం పరిశీలించారు. వైద్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వౌఖిక ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో ఆదేశాలకు అనుగుణంగా సమన్వయ కర్త వరప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 48 నెట్ వర్క్ కార్పొరేట్ వైద్యశాల వైద్యులు, సిబ్బందితో డెంగ్యూ, మలేరియా నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసినట్టు డాక్టర్ వరప్రసాద్ విలేఖర్లకు తెలిపారు. జిల్లాలో 40 మైదాన ప్రాంతాలు, 15 ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసినట్టు ఆయన వివరించారు. ఈ నెల 22న దక్షిణ కాశీ ద్రాక్షారామలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసినట్టు ఆయన వివరించారు. కార్యక్రమంలో కుందూరు, దంగేరు పీహెచ్‌సీల వైద్యురాండ్రు డాక్టర్ రత్నసుధ, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో కుళ్లిన కోడిగుడ్లు
గంగవరం, సెప్టెంబర్ 18: మండలంలో పలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో కుళ్లిన కోడిగుడ్లు లభ్యమయ్యాయి. మంగళవారం మండలంలో ఓజుబంద, నెల్లిపూడి, వడ్డిచెరువు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి వినియోగించే కోడిగుడ్లు పురుగులతో దర్శనమిచ్చాయి. మండలంలో చాలా పాఠశాలలకు పాడైన గుడ్లు సరఫరా అవుతున్నాయి. దీనిపై మండల విద్యాశాఖాధికారి మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.