తూర్పుగోదావరి

సలసల కాగిన గోదావరి తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29: భానుడి భగభగలతో జనం అల్లాడిపోయారు. గోదావరి తీరం ఒక్కసారిగా సలసలా కాగింది. సీజన్‌లో మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరంలో శుక్రవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ఉగ్రరూపానికి జనం విలవిల్లాడారు. ఇంట్లోంచి బయటకు రాలేకపోయారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుండి ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో రాజమహేంద్రవరంలో వేడి వాయువులు చుట్టిముట్టేశాయి. రోహిణీ సమీపించకుండానే ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో జనం తాళలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.