తూర్పుగోదావరి

వరుసగా రెండో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 29: ఎపి ఎంసెట్-2016ను జెఎన్‌టియుకె విజయవంతంగా నిర్వహించగలిగింది. ఎంసెట్‌ను గత రెండేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటుచేసిన ప్రవేశ పరీక్షా కేంద్రాలను వర్సిటీ వైస్ ఛాన్సలర్, ఎంసెట్-2016 ఛైర్మన్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. వర్సిటీ ప్రథాన ద్వారం వద్ద నిర్దేశిత సమయానికి విద్యార్థులను అనుమతించే సమయంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు. అంతకు ముందు ఉదయం 6 గంటలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంజనీరింగ్‌కు సంబంధించి సెట్ కోడ్‌ను వర్సిటీలో విడుదల చేశారు. అల్పాహార కార్యక్రమం అనంతరం ఉదయం 9 గంటలకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షల సెట్ కోడ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ విడుదలచేశారు. జిల్లాకు సంబంధించి అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో 95.23 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 5వేల 513 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 5248 మంది హాజరు కాగా 265 మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్‌కు సంబంధించి జిల్లాలో 93.95 శాతం హాజరు నమోదయ్యింది. 17వేల 709 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 16వేల 535 మంది హాజరు కాగా 1174 మంది గైర్హాజరయ్యారు. అంతకు ముందు విశ్వ విద్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రిలిమినరీ కీని వెబ్‌సైట్ ద్వారా శుక్రవారం వెల్లడించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎవరికైనా అభ్యంతరాలున్న పక్షంలో మే 4వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఎంసెట్‌కు సంబంధించి ఏ విధమైన సందేహాలున్నా 1800 425 6755 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సంప్రదించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్‌ను మే 27న జారీ చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సుమిత్రా దావ్రా, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు డాక్టర్ లక్కసాని వేణుగోపాలరెడ్డి, జెఎన్‌టియుకె వైస్ ఛాన్సలర్, ఎంసెట్-2016 ఛైర్మన్ డాక్టర్ విఎస్‌ఎస్ కుమార్, ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.