తూర్పుగోదావరి

బీసీ బాలికల వసతి గృహంలో ఏపీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, సెప్టెంబర్ 23: సామర్లకోట మున్సిపాల్టీ పరిధిలోని బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆకస్మిక విజిలెన్స్ దాడులు చేపట్టారు. కౌన్సిల్ రాష్ట్ర కమిటీ ఛైర్మన్ మడగల శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో హాస్టల్ స్టాక్ రూమ్, వార్డెన్ ఇంట్లోనూ, స్టోర్ రూమ్‌లోనూ లభించిన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులు పురుగులు పట్టి ఉండటం, స్టాకు రిజిష్టర్‌లో పేర్కొన్నవాటికీ, ఉన్న సరుకులకు ఎటువంటి పొంతనా లేకపోవడం, అలాగే శని, ఆదివారాల్లో 64 మంది విద్యార్థులకు హాజరు పట్టీలో హాజరు వేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. హాస్టల్ వార్డెన్ గృహంలో 100 కిలోల బియ్యం బస్తాలు రెండు, 35 కిలోల చింతపండు, ఒక బస్తాతో సాల్ట్ ప్యాకెట్లు, 20 కిలోల కారంను గుర్తించారు. అలాగే హాస్టల్ స్టాక్ రూమ్‌లో 200 కిలోల కందిపప్పు, 2016లో వచ్చిన 200 నెయ్యి ప్యాకెట్లు, 50 కిలోల శనగపప్పు, 100 కిలోల వరి నూక, 50 కిలోల వరి నూక, 30 కిలోలు వరి పిండి, 25 కిలోల బియ్యం బీపీటీ బస్తాలు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా హాస్టల్ స్టోర్ రూమ్‌లో 100 కిలోల బియ్యం బస్తాలు 74, రాగి పిండి అర కిలో ప్యాకెట్లు 54, హెచ్‌పీ వంట గ్యాస్ సిలెండర్లు 4, బన్సీ ఉప్మా రవ్వ 20 కిలోలు సామాగ్రి పురుగులు పట్టి ఉండటంతో వారు హాస్టల్ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ సిహెచ్ ఉషారాణిని విచారణాధికారులు వివరణ కోరగా సరైన వివరాలు చెప్పకుండా ఏడుపు ముఖం పెట్టారు. పిల్లలకు పూర్తిస్థాయిలో వంటకాలు చేయకుండా, వడ్డించకుండా ప్రభుత్వం సరఫరా చేసే సరుకులను నిల్వ పెట్టారని అధికారులు తెలిపారు. అలాగే బాలుర వసతి గృహాన్ని కూడా అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె పవన్‌కుమార్, జిల్లా కార్యదర్శి రెడ్నం దుర్గాప్రసాద్, పెద్దాపురం నియోజకవర్గం ఛైర్మన్ దివిలి సతీష్, జిల్లా సభ్యురాలు లత, సిబ్బంది పాల్గొన్నారు.

చంద్రుడులో సాయిబాబా..!
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ఆదివారం రాత్రి అందరూ ఆకాశం వైపు చూడ్డం కన్పించింది.. ఎందుకంటే చంద్రుడులో సాయిబాబా కన్పిస్తున్నట్టు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో అందరి చూపూ చంద్రుడి వైపు మళ్లింది. ఆదివారం రాత్రి మాత్రం ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. చంద్రుడులో సాయిబాబా రూపం సంతరించుకోవడంతో అచ్చం సాయిబాబాను పోలిన చంద్రబింబాన్ని ఆసక్తికరంగా తిలకించారు. ఎక్కడ చూసినా ఇదే విషయాన్ని ఆసక్తికరంగా చర్చించుకోవడం, ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకుని దూరంలో ఉన్నవారికి చెప్పడం వంటి ఆసక్తికరమైన చర్చలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో భజనలు కూడా చేశారు. మొత్తం మీద ఎపుడూ చంద్రుడి వైపు చూడని వారు సైతం మననం చేసుకుంటూ చూడటం కన్పించింది.
అవయవ దానానికి వేదికైన కాకినాడ
మలికిపురం: జిల్లా కేంద్రం కాకినాడ ఆదివారం ఒక అరుదైన, అతి పవిత్రమైన కార్యక్రమానికి వేదికయ్యింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఒక యువకుడి తల్లిదండ్రుల సమ్మతితో మెదడు, కాలేయం, కళ్లు సేకరించి, వివిధ ప్రాంతాలకు పంపించారు. కాకినాడలోని అపోలో ఆసుపత్రిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కుమారుడు బ్రెయిన్‌డెడ్ (జీవన్మృతుడు)గా మారిన దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుని, మరణశయ్యపై ఉన్న మరికొందరికి ప్రాణదానం చేయడానికి ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచినమలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి శివరామరాజు దంపతుల ఔదార్యాన్ని పలువురు కొనియాడారు. (పూర్తి వివరాలు ప్రధాన సంచికలో)