తూర్పుగోదావరి

కలెక్టరేట్ ఎదుట పలు సంఘాల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 26: వివిధ రకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంకటాయపాలెంలో దళితులకు శిరోముండనం జరిగి సుమారు 21 ఏళ్ళు అవుతుందని ఈ కేసులోని బాధితులకు ఎస్సీ ధృవపత్రాలివ్వాలంటూ దళిత ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కేసులో ఎ1గా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తనకున్న పలుకుబడితో బాధితులకు ఎస్సీ పత్రాలను ఇవ్వకుండా అధికారులతో కాలయాపన చేయిస్తున్నారని వారు నినదించారు. ఈ ధర్నాలో పోరాట వేదిక కన్వీనర్ వి భీమశంకర్, న్యూడెమోక్రసీ, హెచ్‌ఆర్‌ఎఫ్ నాయకులు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, ఎఐకెఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను, విద్యాలయాల్లో వౌళిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పరిష్కరించాలని కోరుతూ జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులకు జిఓ 151 ప్రకారం వేతనాలివ్వాలని వారు నినాదాలు చేశారు. జిల్లాలో పదవీ విరమణ చేసిన 451 మందికి పించన్లు నిలిచిపోయాయని వారు అన్నారు. ఉపాధ్యాయుల భర్తీ సంఖ్య పెంచాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిఎస్సీ అభ్యర్ధులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎటూ సరిపోని విధంగా ఉపాధ్యాయుల నియామక ప్రకటన తమను నిరాశకు గురిచేసిందంటూ వారు నినాదాలు చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్యకు పితృ వియోగం

కాకినాడ, సెప్టెంబర్ 26: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తండ్రి పెద మాలకొండయ్య (78) బుధవారం ఉదయం మృతి చెందారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. స్థానిక నగరంలోని డాల్ఫిన్ కాలనీలోని స్వగృహంలో పితృవియోగంతో బాధ పడుతున్న మాలకొండయ్యను బీజేపీ నేతలు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పరామర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాలకొండయ్య నివాసానికి వెళ్ళి సానుభూతి తెలియజేశారు. మాలకొండయ్య తండ్రి ఆకస్మిక మృతి పట్ల సీనియర్ బీజేపీ నేత బిక్కిన విశే్వశ్వరరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మాలకొండయ్య తండ్రి నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.