తూర్పుగోదావరి

రెండు రోజుల్లో ఉపాధి కూలీల బకాయిలు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, ఏప్రిల్ 30: ఉపాధి కూలీలకు రావలసిన కూలీ బకాయిలు మరో రెండు రోజుల్లో చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణకుమార్ తెలిపారు. శనివారం మండలంలోని వెలగతోడు గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ చేపడుతున్న పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలనుద్దేశించి మాట్లాడుతూ ఉపాధి కూలీలకు బకాయిలు మరో రెండురోజుల్లో ఇస్తామని, ఇందుకోసం కేంద్రం నుండి నిధులు విడుదలయ్యాయన్నారు. చెరువులో పూడికతీసిన మట్టిని ప్రభుత్వ ఇళ్ల స్థలాలకు మెరక వేసుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. చెరువుగట్టును పటిష్టం చేసుకుని పార్కులుగా అభివృద్ధి చేసుకుంటే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఉపాధి కూలీలకు అందుతున్న వేతనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పలువురు కూలీలు తమ వేతనాన్ని రూ.150 నుండి రూ.200 వరకు పెంపునకు కృషిచేయాలని కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. ఫోన్ నెంబర్లు, పలు సర్వే నెంబర్లు లేకపోవడాన్ని గుర్తించి కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కొందరు వృద్ధులు తమకు పింఛన్ రావడం లేదని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో కె సుబ్బారావు, తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్ జి రామకృష్ణచౌదరి, ఇన్‌చార్జి ఎంపిడివో కడలి పద్మజ్యోతి, ఎన్‌ఆర్‌ఇజిఎస్ శే్వత తదితరులు పాల్గొన్నారు.