తూర్పుగోదావరి

పూడికతీత పనులు పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, ఏప్రిల్ 30: అనపర్తి మండలంలో నీరు - చెట్టు పథకంలో జరుగుతున్న చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టరు అరుణ్‌కుమార్ శనివారం పరిశీలించారు. మండలంలోని దుప్పలపూడి గ్రామ శివారు కృష్ణంరాజు చెరువును పరిశీలించిన కలెక్టరు అరుణ్‌కుమార్ పూడికతీతలో వచ్చిన మట్టిని ఏమి చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఆర్డీవో సుబ్బారావు సమాధానం ఇస్తుండగా అనపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శిరసపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, పాఠశాల క్రీడా పాంగణాల అభివృద్ధితోపాటు సారవంతమైన మట్టి కావడంతో రైతులకు అందజేస్తున్నట్టు తెలిపారు. నీరు - చెట్టు పథకం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం లక్షలు వెచ్చించి పనులు చేయిస్తోందని, ఈ వ్యయం ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలని కలెక్టరు అన్నారు. ఈ పని తమది కాదని ప్రవర్తించకుండా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆర్డీవోను కలెక్టరు ఆదేశించారు. అనపర్తి మండలంలో స్వచ్ఛ గ్రామాల వివరాలను తెలియజేయాలని ఎంపిడిఒ శర్మను కలెక్టరు అడిగారు. మండలంలో మహేంద్రవాడ, పొలమూరు, కుతుకులూరు, పులగుర్త, పీరా రామచంద్రపురం గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా ఉన్నాయని, అనపర్తికి సంబంధించి స్థానిక ఐఎల్‌టిడి కంపెనీ సహకారంతో పనులు చేపట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని ఎంపిడిఒ శర్మ కలెక్టరుకు వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి, సిహెచ్‌సి ఛైర్మన్ దత్తుడు శ్రీను, తేతలి నారాయణరెడ్డి, తహసీల్దారు రియాజ్ హుస్సేన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.