తూర్పుగోదావరి

బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి ధాన్యం తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 16: రైతులకు మేలు జరిగే విధంగా పిపిసి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొన్న ధాన్యంను రైసుమిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి తీసుకోవాలని జెసి ఎ మల్లికార్జున తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల నుండి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం, కస్టమ్, మిల్లింగ్ బియ్యం డెలివరీ అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 294 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యంకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని, దీనికి రైసుమిల్లర్లు సహకరించాలని కోరారు. జిల్లాలో 16 మండలాల్లో వరి కోతలు ప్రారంభించారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొత్తగా ప్రవేశపెట్టిన ల్యాబ్ విధానం ద్వారా సంబంధిత ఏజెన్సీలు ధాన్యం కొనుగోలు చేయాలని జెసి అన్నారు. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంఓయులలో జీఎస్టీ చెల్లిస్తేనే మిల్లర్స్‌కు రావాల్సిన బిల్లులు చెల్లింపు జరుగుతుందని తెలపగా జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాలని గతంలో చెల్లించినట్లే ఈ ఏడాది కూడా చెల్లించాలని బిల్లులు చెల్లింపు విషయంలో ఏ విధమైన ఇబ్బంది రాదని జెసి వారికి వివరించారు. 15 రోజుల్లో సిఎంఆర్ బియ్యం డెలివరీ చేయలేని పక్షంలో తీసుకునే చర్యల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా, ఈ నిబంధన మినహాయింపు చేశామని సంబధిత అధికారులు వచ్చినప్పుడు నిల్వలు చూపించాలన్నారు. జిల్లాలో 9.45 లక్షల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ జఎం ఎస్ విజయకుమారి, డిఎం ఇఎన్ జయరాములు, డిఎస్‌ఓ పి ప్రసాదరావు, డిసిఓ డి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీలో వర్గపోరు
ప్రత్తిపాడు, నవంబర్ 16: ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గానికి ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నాయకత్వం వహిస్తుండగా, మరొక వర్గానికి డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజా సారథ్యం వహిస్తున్నారు. వీరిద్దిరూ ఎవరికి వారు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీ పడుతూ పోటాపోటీగా నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వరుపుల రాజా కార్యాలయంలో ఆయన వర్గం కార్యకర్తలు సమావేశం జరుపుకున్న అనంతరం రాజాకు జై కొట్టుకుంటూ ఎంపీపీ కార్యాలయానికి భారీ ప్రదర్శనతో చేరుకున్నారు. తాము టీడీపీలో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు అమలులో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోడవం అన్యాయమని మండలంలో జరుగుతున్న పనులు కూడా తమకు కాకుండా ఇతరుల చేత చేయించడం సమంజసమా అంటూ వారు ఆందోళన చేశారు. కాగా ఎంపీపీ బత్తుల లోవకుమారి అప్పటికప్పుడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. తాను దళిత మహిళను కావడంతో తన పరిధిలోని మండలంలో జరుగుతున్న పనులకు వరుపుల రాజా అడ్డు తగులుతున్నారని, అభివృద్ధి పనులు ముందుకెళ్ళకుండా తరచూ ఆటంకాలు కలిగిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలోనే కాకుండా సమీప మండలాల్లో ఎక్కడా లేని విధంగా రాజా వర్గం నాయకులు, కార్యకర్తలు తనను చిన్న చూపు చూస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగించడం బాధాకరంగా ఉందని ఆమె సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపీ లోవకుమారి జరిపిన సమావేశంలో మండల టిడిపి అధ్యక్షుడు గొంతెన సురేష్, మాజీ మండల ఉపాధ్యక్షుడు గొల్లు కొండబాబు తదితరులు పాల్గొన్నారు.