తూర్పుగోదావరి

ఆహార భథ్రతా చట్టం పటిష్టంగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 16: పౌష్టికాహార లోపాలులేని ఆరోగ్య సమాజం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేయాలని రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యుడు నాగాబత్తుల శ్రీనివాసరావు కోరారు. స్థానిక ఆర్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఆయన పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, స్ర్తి శిశు సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ కంట్రోల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద వర్గాల ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు 2013లో ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం అమలు పర్యవేక్షణకు ప్రత్యేక ఫుడ్ కమీషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని వివరించారు. రాష్ట్ర కమీషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి జాతీయ ఆహార భద్రతా సక్రమంగా అమలుచేసేందుకు కృషిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా అధికారులతో కలసి వివిధ మండలాల్లో పర్యటించి చట్టం అమలు తీరును పరిశీలించానన్నారు. ఈ తనిఖీల్లో బెండపూడి, తాటిపర్తిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో సక్రమంగా నిర్వహించడం లేదని గమినించామని, సంబంధిత అంగన్‌వాడీ కార్యకర్తపై చర్యలు చేపట్టాలని ఐసిడిఎస్ పీడకి సూచించారు. విద్యార్థుల్లో ఐరన్, విటమిన్ లోపాలను, దృష్టి లోపాలను నివారించేందుకు గ్రామాల్లో సహజ సిద్ధంగా లభించే మునగ, అవిశ ఆకుకూరలను విద్యార్థులకు అందించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం అమలుచేస్తున్న మాతృత్వ వందన, పౌష్టికాహార పథకాలు పటిష్టంగా అమలుచేయాలని అధికారులకు శ్రీనివాసరావు సూచించారు. సమావేశంలో డిఎస్‌ఒ వి వరప్రసాద్, ఐసిడిఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, తూనికలు కొలతలుశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎంఎస్‌ఎస్ మాధురి, సాంఘిక సంక్షేమశాఖ డిడి చినబాబు, డిఎస్‌డబ్యూఓ జెవి రమణ, డిప్యూటీ డిఈఒ సుభద్ర, ఆర్‌బిఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రాజేశ్వరి, ఎఎస్‌ఒ పీతల సురేష్ తదితరులు పాల్గొన్నారు.