తూర్పుగోదావరి

పంతాలు పట్టింపులతో మసకబారుతున్న టీడీపీ ప్రతిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 12: ఇంతవరకూ గుంభనంగా ఉన్న అమలాపురం టీడీపీ నాయకత్వం మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ఎన్నిక నిరవధికంగా వాయిదాపడటంతో పట్టణంలో ఆపార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. 30 మంది కౌన్సిలర్లు కలిగిన అమలాపురం పురపాలక సంఘంలో 22 మంది టీడీపీ సభ్యులే ఉన్నారు. వారిలో ఏమైనా చిన్న-చిన్న విభేదాలు ఉన్నా వాటిని నాలుగు గదుల మధ్య పరిష్కరించుకుని బయట మాత్రం తామంతా ఐక్యంగానే ఉన్నామనే సంకేతాలను ఇచ్చేవారు. దీంతో ప్రతిపక్షాలు సైతం మున్సిపాలిటీలో జరిగే పాలనా పరమైన లోపాలను సైతం ఎత్తి చూపడానికి భయపడిన సంఘటనలు లేకపోలేదు. కౌన్సిల్ సమావేశంలో సైతం ప్రతిపక్ష సభ్యులు ఏమైనా లోపాలను ప్రశ్నిస్తే అధికార పార్టీ సభ్యులు తమదైన శైలిలో ఎదురుదాడికి దిగి సమస్యను పక్కదారిపట్టించిన సందర్భాలు ప్రస్తుత కౌన్సిల్‌లో గడిచిన నాలుగున్నరేళ్లలో అనేక సంఘటనలు జరిగాయి. అలాంటిది వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయానికి వచ్చేసరి టీడీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ప్రతిపక్షాల చేతికి వారే ఆయుధం ఇచ్చినట్లయ్యిందని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైస్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో పట్టణ టీడీపీ రెండుగా చీలిపోయి తమ మాటే నెగ్గాలని ఒక వర్గం, కాదు తమ మాటే నెగ్గాలని మరో వర్గం భీష్మించుకు కూర్చున్నాయి. జెంటిల్‌మెన్ ఒప్పందం అమలు కోసం వైస్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్న పెచ్చెట్టి విజయలక్ష్మి తన పదవికి రాజీనామా అనివార్య కావడంతో టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో తిరిగి ఆ పదవిని ఆమెకే కట్టబెట్టాలని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రస్తుత ఛైర్మన్ యాళ్ల నాగసతీష్ వర్గీయులు పట్టుపడుతున్నారు. విజయలక్ష్మి నాలుగున్నరేళ్లు వైస్ ఛైర్మన్ పదవిలో కొనసాగడమే కాకుండా ఛైర్మన్ పదవిలో ఉండగా యాళ్ల మల్లేశ్వరరావు అకాలమరణంలో ఇన్‌చార్జి ఛైర్మన్‌గా కూడా 10 నెలలు పదవిలో కొనసాగారని, అదే సామాజిక వర్గానికి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ దంగేటి విజయగౌరికి వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టడంలో తప్పేంటని మాజీ ఛైర్మన్ చిక్కాల గణేష్, మెట్ల వర్గీయులు వాదిస్తున్నారు. దీంతో బుధవారం టీడీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి విజలక్ష్మికే వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఒక ఒకవర్గం, విజయగౌరీకే వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టాలని మరో వర్గం ఎవరికీ వారే పట్టుదలతో సమావేశానికి రాకుండా గైర్హాజరై స్వపక్షీయులే తమలో ఉన్న అంతర్గత విబేధాలను బయటపెట్టుకున్నారు.
వైస్ ఛైర్మన్ ఎన్నిక లేనట్టే ?
స్వపక్షంలో వర్గ విబేధాల కారణంగా వాయిదాపడిన వైస్ ఛైర్మన్ పదవికి ఇకపై ఎన్నిక నిర్వహించే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు అంటున్నారు. పురపాలక సంఘం ఐదేళ్ల కాలపరిమితి 2019 జూన్ 5తో ముగియనుంది. ఇక మిగిలింది ఆరు నెలలు కాలమే. అమలాపురంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎందుకు వాయిదాపడిందో తెలియజేస్తూ వివరమైన నివేదికను ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేధించనున్నారు. ఆ నివేదిక త్రూ ప్రోపర్ చానల్ (ఉచిత మార్గం) ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరడం, దానిని పరిశీలించడం, సమయం తక్కువుగా ఉండటం వంటి కారణాల నేపధ్యంలో ఎన్నికల సంఘం వైస్ ఛైర్మన్ ఎన్నికకు మరో మారు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువే నంటున్నారు. పాలక వర్గం కార్యకలాపాలు నిర్వహించాలంటే ఛైర్మన్ సరిపోతారని, వైస్ ఛైర్మన్‌తో అంత పని ఉండదంటున్నారు.