తూర్పుగోదావరి

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 18: మీకోసం ప్రజావాణిలో వచ్చే అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వివేకానంద ప్రజావాణి సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ ఎ మల్లికార్జున, జేసి-2 సిహెచ్ సత్తిబాబు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ మీకోసం ప్రజావాణిలో అర్జీదారుల నుండి అందే అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాధి, ఉద్యోగాలు, కుటుంబ సమస్యలు, భూతగాదాలు తదితర సమస్యలపై సుమారు 360 మంది తమ అర్జీలు అధికారులకు అందజేశారు. పెద్దాపురం మండలం జె తిమ్మాపురం గ్రామానికి చెందిన గుమ్మళ్ల పుత్రయ్య అనే వ్యక్తి తాను వ్యవసాయం చేస్తున్నానని, బ్యాంకు నుండి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నందున రుణాన్ని మాఫీ చేయాలని కలెక్టర్‌ను విన్నవించుకోగా, ఆయన దీనిపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని పెద్దాపురం ఆర్డీవోను ఆదేశించారు. అదే విధంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన గుర్రాల ప్రవీణ్ స్వరూప్ అనే వ్యక్తి తాను నిర్వహిస్తున్న చర్చి శిధిలం కావడంతో నూతనంగా మరో చర్చి నిర్మాణానికి అనుమతివ్వాలని కలెక్టర్‌కు అర్జీ ఇవ్వడంతో కాకినాడ ఆర్డీవోను విచారణ జరపాలని ఆదేశించారు. రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన పులిదిండి గణేష్ అనే వికలాంగుడు తనకు ఎస్సీ కార్పొరేషన్ నుండి కిరాణా షాపు పెట్టుకునేందుకు రుణం ఇవ్వాలని కోరడంతో, అతనికి రుణం మంజూరుచేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, కూనవరం ఆర్‌అండ్‌ఆర్ యూనిట్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా పనిచేశామని, తమకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని సిహెచ్‌వివి సత్యనారాయణ, ఎస్‌ఎస్‌ఎస్‌వి ప్రసాద్, కె సూర్యనారాయణ, టి మల్లయ్య అనే వారు కలెక్టర్‌కు అర్జీ ఇవ్వడంతో ఆయన ప్రత్యేక విషయంగా పరిగణించి వెంటనే సమస్య పరిష్కరించాలని రాజమండ్రి సబ్‌కలెక్టర్‌ను ఆదేశించారు. అల్లవరం మండలం కొమరిగిరిపట్నం గ్రామానికి చెందిన పోతుల నాగేశ్వరరావు అనే వ్యక్తి తనకు గ్రామంలో నాలుగున్నర సెంట్ల ఇళ్ల స్థలం ఉందని, దానిని తన కుమారుడు ఆక్రమించుకుని తాను నడిచేందుకు వీలు లేకుండా చేసినట్టు జేసీకి ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించి అమలాపురం ఆర్డీవోను విచారణ జరిపి బాధితుడుకి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎంవి గోవిందరాజులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

500 మీ. జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
రాజోలు, ఫిబ్రవరి 18: రాజోలు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు కాశ్మీర్ జవాన్ల మృతికి సంతాపంగా 500 మీటర్ల జాతీయ జెండాతో జై జవాన్ అంటూ ర్యాలీ నిర్వహించారు. తొలుత రాజోలు పోలీసు అమర వీరుల స్థూపం వద్దకు చేరుకుని కొవ్వొత్తి వెలిగించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ దేశ సైనికులు ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు తీసుకోవాలన్నారు. దేశం మొత్తం సైనికుల వెంటే ఉందన్నారు. దేశం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం కావాలన్నారు. అనంతరం రాజోలు డిగ్రీ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకూ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ఎన్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి, బత్తుల మురళీకృష్ణ, గుబ్బల శ్రీనివాస్, ఎన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.