తూర్పుగోదావరి

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: ఇంటర్మీడియల్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అంతా సిద్ధం చేసింది. 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీవరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 136 పరీక్షా కేంద్రాల్లో ఒక లక్షా 3 వేల 202 మంది బాలబాలికలు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన చోట్ల సీసీ నిఘా ఏర్పాటు చేశారు. చింతూరులో పరీక్ష పేపర్లను పరీక్ష అనంతరం తరలించడానికి సమయం సరిపోని కారణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల సీలు తీసే చోట, పంపిణీ తదితర చోట్ల సీసీ కెమెరాలతో రికార్డు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్కా నిఘా, భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్మీడిట్ ఆర్‌ఐఓ టేకి వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షను 4956 మంది ఒకేషనల్, 46512 మంది జనరల్ విద్యార్థులతో కలిపి మొత్తం 51468 మంది రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షను 41495 మంది రెగ్యులర్, 5339 మంది ప్రైవేటు విద్యార్థులు, 4369 మంది ఒకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు, 531 మంది ప్రైవేటు విద్యార్థులు వెరశి ద్వితీయ సంవత్సరం 51734 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి, ద్వితీయ పరీక్షకు మొత్తం 93346 మంది జనరల్ విద్యార్థులు, 9856 మంది రెగ్యులర్ విద్యార్థులు కలిపి మొత్తం ఒక లక్షా 3 వేల 202 మంది పరీక్ష రాయనున్నారు.
మొదటి సంవత్సరం బాలురు 22418 మంది, 2809 మంది ఒకేషనల్ విద్యార్థులు, మొదటి సంవత్సరం బాలికల్లో 26647 మంది జనరల్, 2780 మంది ఒకేషనల్ విద్యార్థులు వెరశి మొదటి సంవత్సరం విద్యార్థులు 51468 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి బాలబాలికలు 51725 మంది రాయనున్నారు. మొత్తం జిల్లాలో 352 కాలేజిల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో మురమండ, పామర్రు, వేళంగి, సీతానగరం కాలేజిలకు సంబంధించిన విద్యార్థులు తమ తమ కాలేజిలోని పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు రాస్తున్నారు. ఈ విద్యార్థులకు సమీప కాలేజి చాలా దూరంగా వుండటంతో వారి వారి కాలేజిల్లోనే పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రభుత్వ కాలేజికి మరో ప్రైవేటు కాలేజి విద్యార్థులను కేంద్రంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు 13 ఏర్పాటు చేశారు. జంబ్లింగ్ విధానంలో సెంటర్లు 121, జనరల్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సెంటర్లు 34 ఏర్పాటు చేశారు. ఒక హైపవర్ కమిటీ, డీఈవో కమిటీ, డీవైఈవై, ఆర్జేడీ, ఆర్‌ఐఓ స్క్వాడ్లతో పాటు ఒక పీడీ, లేదా లైబ్రేరియన్, ఒక ఎస్సై, ఒక డిప్యూటీ తహసీల్దారుతో కలిగిన నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్లు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్దే పర్యవేక్షిస్తుంటారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు తెలియజేశారు. సరిగ్గా 9 గంటలకు పరీక్షా ప్రశ్నాపత్రాలను అందిస్తారు. పరీక్షాకేంద్రాల వద్ద మంచినీటి, విద్యుత్ సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు ఆర్‌ఐఓ టేకి వెంకటేశ్వరరావు చెప్పారు. పరీక్షలు 27 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. ఇందులో వాస్తవానికి ఇంటర్మీడియట్ పరీక్షలు 13వ తేదీతో పూర్తవుతాయి. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సులకు సంబంధించి పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి.