తూర్పుగోదావరి

పంటచేలల్లోకి ఆయిల్ ట్యాంకర్ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, మే 19: జాతీయ రహదారిపై అర్థరాత్రి వేళ వేగంగా దూసుకుపోతున్న ఒక పెట్రోలియం సంస్థ ట్యాంకరు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాకొట్టింది. ఎలాంటి ప్రాణహానీ లేకపోయినా ఆ ట్యాంకరులో ఉన్నది పెట్రోలు, డీజిల్ కావడంతో స్థానికులు కొద్ది గంటలపాటు భయాందోళనలకు గురయ్యారు. అయితే అగ్నిమాపక సిబ్బంది, ఆయిల్ కంపెనీ సిబ్బంది జోరు వానలో సైతం సుమారు 5 గంటలపాటు శ్రమించి, ఎలాంటి ముప్పు లేకుండా ట్యాంకరును బయటకు తీసి, దానిలో ఉన్న పెట్రోలు, డీజిల్‌ను వేరే ట్యాంకరులోకి మార్చడంతో పెద్ద ముప్పు తప్పింది. వివరాల్లోకి వెళ్తే... విశాఖపట్నం నుండి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఒక పెట్రోలు బంకుకు భారత పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఒక ట్యాంకరు లారీ 4 వేల లీటర్ల పెట్రోలు, 8 వేల లీటర్ల డీజిల్‌తో బయలుదేరింది. మండలంలోని గోపాలపురం వశిష్ఠ గోదావరి బ్రిడ్జి సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న కారును దాటివెళ్లే ప్రయత్నంలో అదుపుతప్పి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుండి హైవే రక్షణ గోడలను గుద్దుకుని, పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయి బోల్తాపడింది. ఈ లారీలో డ్రైవరు ఒక్కరే ఉండగా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డాడు. రాత్రివేళ ప్రమాదం జరగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టే వీలు కలగలేదు. అయితే ట్యాంకరు నుండి పెట్రోలు లీకైతే మంటలు చెలరేగే ప్రమాదం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక అధికారి సిహెచ్ నాగేశ్వరరావు గురువారం ఉదయం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ లీకయినా మంటలు అంటుకోకుండా ముందు జాగ్రత్తగా ఫోమ్ చల్లి, జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఆయిల్ కంపెనీ సిబ్బంది భారీ క్రెయిన్‌ను రప్పించి, లారీని వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే లారీని వెలికితీసే సమయంలో నిప్పురవ్వలు రేగితే ఆ మంటలు చెలరేగే అవకాశాలు ఉండటంతో ఆ సమయంలో ఉత్కంఠ నెలకొంది. ట్యాంకరును వెలికితీస్తున్న సమయంలో పలుమార్లు అగ్నిమాపక సిబ్బంది ఫోమ్ చల్లుతూ జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు చెలరేగితే చల్లేందుకు డిసిపి సిఒటు పౌడర్ సిలెండర్లను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే వాటి అవసరం లేకుండానే ట్యాంకరును సురక్షితంగా క్రెయిన్ సాయంతో జాతీయ రహదారిపైకి చేర్చారు. అనంతరం వేరే ట్యాంకరులోకి పెట్రోలు, డీజిల్‌ను మార్పించడంతో సుమారు 12 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఈ సహాయక చర్యల సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించి, తగు జాగ్రత్తలు తీసుకున్నారు.