తూర్పుగోదావరి

బలవంతంగానైనా వైద్యం చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 13: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. సోమవారం సాయంత్రం వైద్య నిపుణులు వెళ్లగా ముద్రగడ పరీక్షలకు నిరాకరించారు. ప్రతీ రెండు గంటలకొకసారి వైద్య పరీక్షలకు ప్రయతిస్తున్న వైద్యులు మెడికల్ బులిటిన్ విడుదలచేశారు. ముద్రగడ వైద్య పరీక్షలకు నిరాకరించారని, కనీసం సైగలు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారని, పైకి కూర్చుని కన్పిస్తున్నప్పటికీ శరీరంలోని భాగాలు ఆందోళనకరంగా మారుతున్నాయని, బిపి, షుగర్ లెవెల్ బాగా పడిపోయి ఉంటాయని, ఆయన పరిస్థితిని మెరుగుపర్చాలంటే తక్షణం బలవంతంగానైనా రక్తపరీక్ష చేయించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. శరీరతత్వాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుందంటున్నారు. ముద్రగడ వైద్యం నిరాకరిస్తూ నిరాహార దీక్ష కొనసాగిస్తూ వంద గంటలు పూర్తవుతోంది. ముద్రగడ సతీమణి పద్మావతి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఎట్టకేలకు ముద్రగడను ఒప్పించి సెలైన్ పెట్టామని వైద్యులు తెలిపారు. ముద్రగడ కోడలు సిరి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ముద్రగడ మంచినీరు తీసుకుంటున్నారు కాబట్టి కిడ్నీలపరంగా కాస్తంత పరిస్థితి అదుపులోవుందని, మిగిలిన అన్ని విధాలుగా ముద్రగడ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. బలవంతంగానైనా వైద్యం అందించాల్సి ఉందని స్పష్టంచేశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపించామని వైద్యులు విజయేంద్ర, రమేష్ కిషోర్, యశోధ, వెంకటాచలం, నాయక్ తదితరులు తెలిపారు. తుని ఘటనకు సంబంధించి అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నవారిని బెయిల్‌పై తీసుకురావడానికి కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంట్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమావేశమైనట్టు తెలిసింది. ఇప్పటికే నగరంలోని ఒక న్యాయవాదితో చర్చించి బెయిల్‌పై వారిని తీసుకురావడానికి సామాజికవర్గ పరంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా ముద్రగడ కుటుంబ సభ్యులను సన్నిహిత బంధువులు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం పరామర్శించారు.