తూర్పుగోదావరి

1 నుండి రంజాన్ కానుకలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 3: వచ్చే జూలై 1వ తేదీ నుండి రంజాన్ తోఫా సరుకులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచామని జెసి ఎస్ సత్యనారాయణ రేషన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసి కేంద్రం నుండి హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ జయలక్ష్మి జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ బదులిచ్చారు. జూలై 6వ తేదీన రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా సరుకులను జూలై 1వ తేదీ నుండే పంపిణీకి సిద్ధం చేశామన్నారు. గోధుమలు 5 కిలోలు, పంచదార 2 కిలోలు, నెయ్యి 100 గ్రాములు, సేమియా 1 కిలోతో కూడిన కిట్‌ను పంపిణీ చేయాలని డీలర్లకు చెప్పామన్నారు. అర్హులైన ముస్లింలు కార్డ్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో 21 వేల మంది ముస్లిమ్ కార్డుదారులుండగా 14 వేలు రంజాన్ తోఫా కిట్లను సిద్ధం చేస్తున్నట్లు జెసి కమిషనర్‌కు బదులిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎస్‌ఓ జి ఉమామహేశ్వరరావు, సివిల్ సప్లయిస్ డిఎం కె కృష్ణారావు పాల్గొన్నారు.