తూర్పుగోదావరి

అమలాపురంలో రోడ్డెక్కిన కాపుయువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 17: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల నేపథ్యంలో అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు నల్లా పవన్ ఆధ్వర్యంలో కాపు యువత శుక్రవారం రోడ్డెక్కారు. ముద్రగడ ఆమరణ దీక్ష కారణంగా జిల్లాలో సెక్షన్ 144, 30 అమలులో ఉండటంతో అమలాపురంలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. దీంతో కాపు నాయకులు, యువత ఇళ్లకే పరిమితమై నిరసనలు తెలుపుతున్నారు. గత తొమ్మిది రోజులుగా కాపు నాయకులను, యువతను రోడ్లపైకి రాకుండా కట్టడి చేయగలిగిన పోలీసులు శుక్రవారం వారిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. నిషేధాజ్ఞలు అమలులో ఉండగా ధర్నాలు, రాస్తారోకోలు చేయరాదని పోలీసులు వారించినప్పటికి కాపు యువత పట్టించుకోకుండా గడియార స్తంభం సెంటర్‌కు చేరుకుని నిరసన తెలిపారు. పవన్ నాయకత్వంలో వందలాదిగా కాపు యువత గడియార స్తంభం సెంటర్‌లో మానవహారం, రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా బస్టాండ్‌కు చేరుకుని అక్కడ వంగవీటి రంగా విగ్రహానికి పూల మాలలు వేసి, ఈదరపల్లి వంతెన వద్ధ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భగా ముద్రగడను వెంటనే మీడియా ముందు ప్రవేశపెట్టాలని, అక్రమంగా అరెస్టు చేసిన కాపు యువతను వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లా సాయి, వాకపల్లి కృష్ణ, వలవల వెంకన్న, కురస బాలాజీ, గోకరకొండ రమేష్, అధికారి వెంకటేశ్వరరావు, బద్రి వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. కాగా టిబికె జెఎసి కోనసీమ కన్వీనర్ కల్వకొలను తాతాజీ, దివంగత కాపు నాయకుడు నల్లా సూర్య చంద్రరావుల ఇళ్లవద్ద పోలీసు పహారా కొనసాగుతోంది.