తూర్పుగోదావరి

మంత్రుల వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 17: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేవనెత్తిన డిమాండ్లపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ హెచ్చరించారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మోసకారిగా డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ అభివర్ణించారు. తన వైఖరిని మార్చుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నగర కాపు సంఘం ఆధ్వర్యంలో తిలక్‌రోడ్డులో చేపట్టిన రిలే దీక్షల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కాపులపై నమోదు చేసిన కేసులను విరమించుకుని, ముద్రగడ దీక్షను విరమింపజేయాలన్నారు. ముద్రగడ దీక్షకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. కాపు సంఘం అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, కాంగ్రెస్ కార్పొరేటర్ రాయుడు సతీష్, నాయకులు రామినీడి మురళి, ఎన్‌వి శ్రీనివాస్, రాయుడు రాజవల్లి, బాలేపల్లి మురళి, కె శ్రీనివాస్, ఎం మాధవ్, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, దాసి వెంకట్రావు, వైసిపి నాయకులు మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, దొండపాటి సత్యంబాబు, యెనుమల రంగబాబు, చిక్కాల బాబులు, కటిక కుమారస్వామి, వోగేటి రవి తదితరులు పాల్గొన్నారు.
గోరింటలో కాపు ఉద్యమానికి పోలీసుల బ్రేక్
పెద్దాపురం: ముద్రగడ దీక్షకు మద్దతుగా మండలంలోని గోరింట గ్రామంలో శుక్రవారం కాపు నేతలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సుమారు వందమందికి పైగా కాపు యువకులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో గోరింట గ్రామం చేరుకున్నారు. ప్రధాన రహదారిపై గ్రూపులుగా ఉన్న యువకులను చెదరగొట్టారు. ఆందోళన చేపట్టకుండా అడ్డుకున్నారు. కాపు ఉద్యమానికి ఊతమిస్తే అరెస్టు చేస్తుండడంతో ముద్రగడకు మద్దతు తెలిపేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. గోరింటలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 144, సెక్షన్ 30 అమల్లో ఉందని ప్రజలు గమనించాలన్నారు.