తూర్పుగోదావరి

వంతెన నిర్మాణానికి సమీపంలో ఇసుక తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూలై 4: నిర్మాణంలో ఉన్న వంతెనకు సమీపంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వాడపాలెం శివారు నారాయణలంక తొగరపాయపై సుమారు కోటి ఎనభై లక్షల వ్యయంతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. చాలాకాలంగా వంతెన కోసం ప్రయత్నాలు జరిగినా చివరకు నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. అయితే నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమార్కులు తొగరపాయలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దీంతో నిర్మాణంలో ఉన్న వంతెనకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వంతెనను అడ్డం పెట్టుకొని కొందరు అక్రమార్కులు ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. గోదావరికి వరద వస్తే ఇసుక తవ్వకం కారణంగా వంతెనకు ప్రమాదం ఏర్పడుతుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. తొగరపాయలో ఇసుక తవ్వకానికి ఎటువంటి అనుమతులు లేకున్నా యధేచ్ఛగా ఇసుకను తవ్వుతున్నారని, దీనిని ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు.
దీనిపై ఆర్ అండ్‌బి డిఇని విరణ కోరగా వంతెన నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయకూడదని, ఇసుక తవ్వకాలు చేసేవారిపై కేసులు పెడతామని తెలిపారు.