తూర్పుగోదావరి

ఉత్తమ పద్ధతులతో లక్ష్యాల సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 4: జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసే శాఖలు తమ లక్ష్యాల సాధనలో ఉత్తమ పద్ధతులు పాటించటం ద్వారా మంచి ఫలితాలు పాటించవచ్చని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పథకాల అమలులో వినూత్న పద్ధతులు అనుసరించడం అవసరమన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానం అమలులో భాగంగా ఇప్పటికే 10 శాఖల్లో ఏర్పాటు చేశామని, అదే విధంగా మరో 22 శాఖలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఉన్న అన్ని కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని, ఇతర శాఖలతో జరిపే ప్రత్యుత్తరాలతో బాటు ఆయా కార్యాలయాల్లోని కార్యకలాపాలన్నీ ఇ-ఆఫీసులోనే నిర్వహించాలన్నారు. ఈ నెల 3వ వారంలో జిల్లా వనమహోత్సవం జరుగుతుందని, ఆ రోజున 10 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 43 లక్షల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 514 పాఠశాలల్లో కూరగాయల కోసం కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 843 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను నిర్మిస్తున్నామని, వీటిలో ఇప్పటివరకు 333 భవనాలకు పరిపాలనామోదం ఇవ్వగా మిగిలిన వాటికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ భవనాలు ప్రతీ మండలంలో 10, ఏజెన్సీ మండలాల్లో 20 చొప్పున నిర్మించాలన్నారు. ఈ నెలాఖరు నాటికి వరినాట్లు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జరుగనున్న స్మార్ట్ పల్స్ సర్వేలో వ్యవసాయ, ఆరోగ్య శాఖలు మినహా అన్నీ పనిచేయాలని, జిల్లాలో 24 మండలాలు మినహా అన్ని మండలాల్లో ఈ స్మార్ట్ సర్వే జరుగుతుందన్నారు. ఈ ఏడాది కార్పొరేట్ సంస్థ నుండి ప్రోత్సాహం పథకం దాదాపు లేనట్టేనని, ఈ విషయాన్ని తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జెసి ఎస్ సత్యనారాయణ, జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, బిసి కార్పొరేషన్ ఇడి ఎం జ్యోతి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ పి వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్య్లుఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సిఎస్‌ఎన్ మూర్తి, డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.