తూర్పుగోదావరి

రామేశ్వరం మొగను మళ్లీ తవ్విస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, జూలై 4: నాలుగు మండలాల మురుగు నీరు సముద్రంలో కలవడానికి మార్గమైన అల్లవరం మండలంలోని రామేశ్వరం మొగ మళ్లీ తవ్వడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. సోమవారం బోటుపై వెళ్లి మొగను ఆయన పరిశీలించారు. బోటుకు సాంకేతిక లోపం ఏర్పడటంతో అరగంట సేపు బోటు డ్రెయిన్‌లోనే నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఇంజన్ నావల సాయంతో బోటును ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలంలో 70 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, ఇక్కడ మురుగునీరు కూనవరం నుండి రామేశ్వరం మీదుగా సముద్రంలోకి కలవడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రామేశ్వరం మొగ మూసుకుపోవడం వల్ల డ్రెయిన్‌లోని నీరు దిగే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని, అటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గచ్చకాయల పొర నుండి డ్రెయిన్ కట్లు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని రాజప్ప చెప్పారు. రామేశ్వరం మొగ తవ్వించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఇరిగేషన్ ఇఇ విజయబాబు, డిఇ భానుబాబు, ఆర్డీఒ జి గణేష్‌కుమార్, తహసీల్దార్ పాము సుబ్బారావు, నాయకులు గునిశెట్టి చినబాబు, దాట్ల గోపీరాజు, సర్పంచ్ పెచ్చెట్టి రామకృష్ణశెట్టి, పలువురు ఎంపిటిసిలు ఉన్నారు.