తూర్పుగోదావరి

కేంద్ర మంత్రులను కలిసిన పుదుచ్చేరి సిఎం, మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యానాం, జూలై 19: పుదుచ్చేరిలో నెలకొన్న పలు శాఖల సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసిందని పుదుచ్చేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఉందయం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి యానాంలో పెండింగ్‌లో ఉన్న పలు పనులకు నిధులను కేటాయించమని కోరామన్నారు. యానాం దరియాలతిప్ప మార్గంలో 139 కోట్ల రూపాయలతో చేపట్టిన ఏటిగట్టు ఆధునికీకరణ నిలిచిపోయిందని, వాటికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసి ఉందని ఉమాభారతి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. అదే విధంగా పాండిచ్చేరి రైయిన్‌బో నగర్‌లో వరద నివారణకు 98 కోట్ల రూపాయలు మంజూరు చేయవసిందిగా విన్నవించగా ఉమాభారతి అంగీకారం తెలిపారన్నారు. అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ కలిసి పుదుచ్చేరీ-చైన్నయ్‌ల మద్య కార్గో రవాణాకు, పాండిచ్చేరిలో పోర్టు అభివృద్ధికి టూరిజం ద్వారా షిప్‌లు రవాణాకు అవకాశాలు కల్పించాలని అడిగినట్టు కృష్ణారావు తెలిపారు. అదే విధంగా టూరిజం శాఖ మంత్రులను పుదుచ్చేరీలో ఆధ్యాత్మికత అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసిందిగా కోరామన్నారు. ఇందులో యానాంలోని చర్చి అభివృద్ధికి రూ. 2 కోట్లు, మాహేలోని చర్చి అభివృద్ధికి మరో రెండుకోట్లు కేటాయించాలని కోరామన్నారు. యానాం ఐలెండ్‌లో టూరిజం అభివృద్ధికి 50 కోట్లు రూపాయలు అడిగామని, వీటన్నింటికి సానుకూలంగా స్పందించినట్టు మంత్రి కృష్ణారావు తెలిపారు. కార్యక్రమంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు మల్లాడి , నమశ్శివాయ, కందసామి పాల్గొన్నారు.