తూర్పుగోదావరి

‘వ్యవసాయం’లో ర్యాంకుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 19: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన పిజి ప్రవేశ పరీక్షలో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. జాతీయస్థాయిలో కూడా సత్తా చాటారు. రాజమహేంద్రవరం కళాశాల విద్యార్థిని కొవ్వూరి సరిత విశ్వవిద్యాలయ స్థాయిలో ద్వితీయ, ఆంధ్రాయూనివర్శిటీ పరిధిలో ప్రథమ ర్యాంకును సాధించింది. మొత్తం 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 33 మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి జయరామిరెడ్డి తెలియజేశారు. వారిలో 12మంది 50లోపు ర్యాంకులు, 18 మంది 100లోపు, 21 మంది 150లోపు, 28 మంది 200లోపు ర్యాంకులు సాధించారని వివరించారు. తమ కళాశాలకు చెందిన పి శ్రీదేవి రాష్టస్థ్రాయిలో 8, బిన్నీథామస్ 11, ఎం దేవి 19వ ర్యాంకును, ఎస్టీ విభాగంలో తణుకుకు చెందిన సోమాల కార్తీక్ ప్రథమ ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే రాజమహేంద్రవరం కళాశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి పిజి ప్రవేశ పరీక్షలో కూడా ప్రతిభకనపరిచి సీట్లు సాధించారన్నారు. 12 మంది గుజరాత్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించారని వెల్లడించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 22న గుంటూరు లాంఫారంలో జరిగే కౌనె్సలింగ్‌లో పిజి కోర్సుల్లో సీట్లు కేటాయింపు జరుగుతుందని తెలిపారు.