తూర్పుగోదావరి

అమర్‌నాథ్ యాత్రలో గుండెపోటుతో మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, జూలై 19: అమరనాథ్ యాత్రకు వెళ్లిన మండలంలోని కె గోపాలపురంలో ఒక భక్తుడు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి మృతుని బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 15న అమర్‌నాథ్ యాత్రకు బుదిరెడ్డి నూకరాజు, అతని భార్య నరసమ్మ, బంధువులు మరో అయిదుగురు, అలాగే కోరుకొండ మండలం బాపూజీపేట నుంచి 40మంది భక్తులతో కలిసి అమరనాథ్ యాత్రకు బయల్దేరారు. అమరనాథ్ సమీపంలో సోమవారం రాత్రి నూకరాజు గుండెలో నొప్పి వస్తోందని చెప్పడంతో ఇక అమరనాధ్ ఆలయానికి వెళ్లకుండా దిగువనే ఉండిపోయారు. నూకరాజుకు గుండె నొప్పి ఎక్కువ కావడంతో కాట్రా గ్రామంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నూకరాజు (48) మృతిచెందినట్లు స్థానికంగా ఉన్న మృతుని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామం తీసుకురావడానికి నూకరాజు బంధువులు ప్రయత్నిస్తున్నారు. కాకినాడ ఎంపి తోట నరసింహం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉండడంతో ఆయనకు కూడా సమాచారం అందించగా, డిజిపి చొరవతో సాధ్యమైనంత త్వరగా స్వగ్రామం కె గోపాలపురం తరలించేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు ఎంపి తోట నరసింహం మృతుని బంధువులకు చెప్పారు.