తూర్పుగోదావరి

కడియంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జూలై 19: కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు జరుగుతున్నాయని అఖండ గోదావరి ప్రాజెక్టు డైరెక్టర్, టూరిజం స్పెషలాఫీసర్ భీమశంకరం అన్నారు. కడియపులంక గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్థానిక నర్సరీ రైతులతో భీమశంకరం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడున్న సహజమైన అందాలకు మరికొన్ని రంగులు అద్దితే దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే అవకాశముందన్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందుకు నర్సరీ రైతులు కూడా సహకరించాలని భీమవరం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు మాట్లాడుతూ కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచాయని, అయితే అందుకు తగిన విధంగా ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతాభివృద్ధికి నర్సరీ రైతు సంఘం తరపున తాము ఎటువంటి సహకారం అందించడానికైనా సిద్ధమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వారా పాప, ఎంపిడిఒ మూర్తి, తహసీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు.