తూర్పుగోదావరి

యువకుడిపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, జూలై 18: తన సోదరిని ప్రేమిస్తున్నాడనే అక్కసుతో ఒక యువకుడిపై మరొక యువకుడు హత్యాయత్నం చేయగా గాయాలతో బయటపడిన ఘటన నేదునూరు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయినవిల్లి మండలం నేదునూరు గ్రామానికి చెందిన కాగిత మోహన్ (22)పై అదే గ్రామానికి చెందిన పులిదిండి నాగరాజు వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మంగళవారం కాగిత మోహన్ ఇంటి నుండి మరుగుకోసం మురుగుకాలువ వద్దకు వెళ్లాడు. అయితే నాగరాజు సోదరి అటువైపు పశువులను మేపుతున్నదని స్థానికులు తెలిపారు. మోహన్ ఇంటికి తిరిగి వస్తుండగా కణితి భాస్కరాచార్యులు పొలం వద్ద మాటువేసిన నాగరాజు ఒక్కసారిగా మోహన్‌పై కొడవలితో దాడి చేశాడు. మోహన్ రెండు చేతులను అడ్డు పెట్టుకోవడంతో రెండు చేతులకు బలమైన గాయాలయ్యాయి. దీంతో మోహన్‌ను 108లో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అయినవిల్లి ఎస్సై డి దుర్గాశేఖరరెడ్డి, ఎఎస్సై ఎంవికె రాజు నేదునూరు వచ్చి స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. నాగరాజు దాడికి ఉపయోగించిన కొడవలి, కర్రలను తుప్పల్లో నుండి ఎఎస్సై రాజు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై దుర్గాశేఖరరెడ్డి తెలిపారు.