తూర్పుగోదావరి

ముంగండ భారీ చోరీ కేసులో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.గన్నవరం, జూలై 19: ముంగండలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టుచేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అమలాపురం డిఎస్పీ ఎల్.అంకయ్య తెలిపారు. ఆయన మంగళవారం పి.గన్నవరం పోలీసుస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముంగండ గ్రామానికి చెందిన బొడ్డు కోటసత్య రమణీకుమారి ఈ నెల 12వ తేదీన తన ఇంట్లో చోరీ జరిగిందని పి.గన్నవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చోరీ జరిగిన ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కుక్కల శ్రీనివాసరావుపై అనుమానం రావడంతో గాలించారు. మంగళవారం ఉదయం ముంగండ బస్టాండ్ వద్ద శ్రీనివాసరావును అరెస్టుచేసి అతని వద్ద నుండి 22 కేజీల 166 గ్రాముల వెండి, 100 గ్రాముల బంగారం బిస్కెట్లు, 6 వేల రూపాయల నగదును రికవరీ చేసినట్టు డిఎస్పీ తెలిపారు. కుక్కల శ్రీనివాసరావు గత మే నెలలో చోరీ జరిగిన ఇంట్లో వడ్రంగి పనులు చేసినట్టు డిఎస్పీ చెప్పారు. ఇంటి యజమానురాలు జూన్ 11వ తేదీన గాయపడిన తన కుమార్తెకు సపర్యలు చేసేందుకు హైదరాబాద్ వెళ్లగా జూలై 10వ తేదీన రాత్రి కుక్కల శ్రీనివాసరావు దోపిడీ చేసి జాగిలాలు పసిగట్టకుండా ఉండేందుకు ఇల్లంతా కారం చల్లి పక్కనే తను అద్దెకు ఉంటున్న ఇంట్లో మంచం కింద దొంగిలించిన వస్తువులను పెట్టి నగదు పట్టుకొని ఉడాయించాడు. ఫిర్యాదుదారు ఇచ్చిన రిపోర్టులో రూ. 25 వేలు పోయిందని తెలుపగా గత వారం రోజులుగా సొమ్మును ఖర్చుపెట్టగా మిగిలిన 6 వేల 5 వందల రూపాయలు నిందితుడి నుండి రికవరీ చేసినట్టు డిఎస్పీ తెలిపారు. ముంగండలో గత నెలలో ఒక ఇంటిలో చోరీ చేసిన వాటర్ మోటారు కూడా నిందితుని ఇంట్లో దొరికిందని డిఎస్పీ అంకయ్య తెలిపారు. నిందితుని బుధవారం కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. వారం రోజుల్లో నిందితుడిని, సొత్తును రికవరీ చేసిన రావులపాలెం సిఐ పివి రమణను, పి.గన్నవరం ఎస్సై పూడి వీరబాబును, సిబ్బందిని డిఎస్పీ అంకయ్య అభినందించారు.