తూర్పుగోదావరి

మావోయస్టు సానుభూతిపరులు లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూలై 21: మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేస్తున్న ఏడుగురు గురువారం జిల్లాలో పోలీసులకు లొంగిపోయారు. ఎటపాక పోలీసు స్టేషన్లో ఒఎస్‌డి ఫకీరప్ప, ఎఎస్పీ శే్వత ఎదుత వీరు లొంగిపోయారు. వీరంతా చింతూరు మండలం లంకపల్లి గ్రామానికి చెందినవారు. కొవ్వాసి ముఖేష్, చోడే ముఖేష్, మడకం ఇడుమా, వంజం దేవ, వెట్టి బేడి, వంజం జోగి, మడకం లలిత గతంలో మావోయిస్టు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్‌కు సానుభూతిపరులుగా పనిచేశారని పోలీసు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వీరంతా లొంగిపోయినట్లు ఒఎస్‌డి ఫకీరప్ప తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతూరు సిఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్, ఎటపాక ఎస్సై హెచ్ నాగరాజు పాల్గొన్నారు.