తూర్పుగోదావరి

అంత్య పుష్కరాలకు 30న ట్రయల్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి అంత్య పుష్కరాల నిర్వహణపై ఈ నెల 30న ట్రయల్ నిర్వహిస్తామని కమిషనర్ వి విజయరామరాజు వెల్లడించారు. 29వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 31న ఉదయం గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభమవుతాయన్నారు. గురువారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అంత్య పుష్కరాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 27నాటికి స్నానఘట్టాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 31వ తేదీన ఉదయం 5గంటలకు సంబంధిత అధికారులంతా విధులకు హాజరుకావాలన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు, కోటిలింగాలరేవు, మార్కండేయస్వామిరేవు, సరస్వతీ ఘాట్, ధవళేశ్వరంలో రామపాదాలరేవులను ముఖ్యమైన ఘాట్లుగా గుర్తించామన్నారు. ముఖ్యమైన అన్ని స్నానఘట్టాల్లో ఏర్పాట్ల పర్యవేక్షణను డిప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారులకు అప్పగిస్తామన్నారు. నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు తిరిగే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. స్నానఘట్టాల వద్ద వైద్యశిబిరాలతో పాటు, అత్యవసర వైద్యసేవల కోసం ఐఎంఏ సహకారంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించాలని ఆదేశించారు. పిండ ప్రదానాలపై ఫిర్యాదులు రాకుండా చూడాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, మార్గసూచీల వంటి ఏర్పాట్లను నగరపాలక సంస్థ చేపడుతుందన్నారు. ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ రోజుకు లక్ష నుంచి లక్షన్నర యాత్రికులు వస్తారన్న అంచనాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సుమారు 3800 మంది సిబ్బందిని కేటాయించాలని కోరగా, ఇప్పటి వరకు 2800 మందిని కేటాయించారన్నారు. ప్రధానమైన ఘాట్లకు డిఎస్పీలను ఇన్‌చార్జిలుగా నియమిస్తామన్నారు. వికలాంగుల వాహనాలను స్నానఘట్టాల వరకు అనుమతిస్తామన్నారు. ఇతర వాహనాలను గూడ్స్‌షెడ్, లూథర్‌గిరిల వద్ద నిలిపివేస్తామన్నారు. చోరీల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆటో చార్జీలను నియంత్రించేందుకు త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీ జె కులశేఖర్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కెఎస్‌ఎన్ మూర్తి, ఇన్‌చార్జి ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.