తూర్పుగోదావరి

శృంగార వల్లభునికి టిటిడి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దాపురం, జూలై 21: పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని స్వయంభువు శ్రీ శృంగార వల్లభస్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఇంత వరకు అభివృద్ధికి నోచుకోక, జీర్ణదశకు చేరిన ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకుని అభివృద్ధికి చర్యలు చేపడుతుంది. గతంలో టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి గ్రామంలో పర్యటించి, ఆలయాన్ని సందర్శించి వెళ్లారు. హోం మంత్రి చినరాజప్ప అభ్యర్థన మేరకు ఆలయాన్ని టిటిడి దత్తత తీసుకునేందుకు ఛైర్మన్ అంగీకారం తెలిపారు. అనంతరం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈమేరకు తీర్మానం చేసి, ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు. దీనిలో భాగంగా టిటిడి రూ. కోటి వరకు నిధులు మంజూరుచేస్తుందని మంత్రి చినరాజప్ప తెలిపారు. మొదటి విడతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25 లక్షలు మంజూరుచేసిందన్నారు. గురువారం టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో ఆలయాన్ని సందర్శించిన మంత్రి చినరాజప్ప, ఆలయ ప్రాంగణాన్ని, జీర్ణదశలో ఉన్న ఆలయ గాలిగోపురం, గర్భగుడి వంటి ప్రదేశాలను పరిశీలించారు. టిటిడి సహకారంతో పాటు, దాతల ద్వారా రూ. 6.25 లక్షలు సమకూరాయన్నారు. వీటిని ప్రత్యేక బ్యాంకు ఖాతాతెరిచి జమచేయాలన్నారు. టిటిడి మంజూరుచేసిన నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఆలయంలో విరాళాలతో ప్రతి శనివారం 300 మందికి అన్నదానం నిర్వహిస్తున్నట్టు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బందిలి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆలయ ఆధునికీకరణలో భాగంగా గోపుర శిఖరానికి రూ.5 లక్షలు, మండపంలో చెక్క తలుపులు ఏర్పాటుకు రూ. 2 లక్షలు, గర్భాలయం, అర్ధమండపం, ఊంజల్ మండపాలు, ఫ్లోరింగ్ రూ. 5 లక్షలు, ఆలయ ప్రాంగణం ఫ్లోరింగ్‌కు రూ. 8 లక్షలు, ఇతర పనులు, గ్రిల్స్ ఏర్పాటు, రంగులు వంటి పనులకు మొత్తం రూ.25 లక్షలు ఖర్చవుతుందన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి చినరాజప్ప, ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిరాజుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి, ఎంపిపి గుడాల రమేష్, ఎఎంసి ఛైర్మన్ ముత్యాల రాజబ్బాయి, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, సందీప్, పెదకాపు, వీరేంద్ర, చౌదరి, ఆలయ ఇఓ ఎం రాంబాబురెడ్డి, ప్రధాన అర్చకులు పెద్దింటి గోపాలాచార్యులు, సీతారామాచార్యులు, పురుషోత్తమాచార్యులు, ఎఎంసి వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.