తూర్పుగోదావరి

కోటిపల్లి -నరసాపురం రైల్వే లైను ఏడేళ్లలో పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూలై 21: కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను ఏడేళ్లలో పూర్తిచేసే విధంగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసిందని కోనసీమ రైల్వే లైను నిర్మాణ చీఫ్ ఇంజనీర్ బలిజ అశోక్ వెల్లడించారు. గురువారం కోనసీమ జెఎసి ఆధ్వర్యంలో స్థానిక కాటన్ గెస్టు హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచామని, టెండర్లు ఖరారైన వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తారన్నారు. ముందుగా కోటిపల్లి గోదావరిపై సుమారు 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. 70.3 అడుగుల గడ్డర్స్‌తో 44 పిల్లర్సు ఏర్పాటు చేసి రెండు లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేశామన్నారు. మొదట ఒక వంతెనను పూర్తిచేసి, ఈ లైనులో ఆదాయ మార్గాలను అనుసరించి మరో లైను ఏర్పాటుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయించిందన్నారు. పనులు ప్రారంభమైతే రానున్న బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలుంటాయని, పనులు ఆగకుండా చేస్తే ఏడేళ్లలో రైల్వే లైను పూర్తిచేయవచ్చన్నారు. కోటిపల్లి గౌతమీ నదిపై వంతెన నిర్మాణానికి రూ. 600 కోట్లు ఖర్చుకాగలదని అశోక్ తెలిపారు. అయితే కోటిపల్లి నుండి అమలాపురం రైల్వే లైను పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయ్యాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు కూడా సకాలంలో విడుదల చేసేలా స్థానిక జెఎసి కృషి చేయాలని అశోక్ సూచించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జెఎసి కన్వీనర్ బండారు రామ్మోహన్‌రావు, భూసారపు వెంకటేశ్వర్లు, రాయుడు శ్రీరామచంద్రమూర్తి, డాక్టర్ మధుర నరసింహమూర్తి, మడికి శ్రీరాములు, యార్లగడ్డ రవీంద్ర, ముత్యాల వెంకటేశ్వరావు, భూసారపు వీరబాబు, ఉండ్రు బాబ్జీ, కరాటం ప్రవీణ్, అబ్బిరెడ్డి సోమేశ్వరరావు, జంగా రాజేంద్ర, ఆకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.