తూర్పుగోదావరి

ఆగస్టు రేషన్ తీసుకోకపోతే... కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం/ మండపేట, జూలై 21: ఆగస్టు నెలలో తెల్లకార్డు వినియోగదారులు ఆగస్టు నెలలో రేషన్ సరుకులను తీసుకోకపోతే ఆ రేషన్ కార్డులు మనుగడలో ఉండవని జిల్లా పౌర సరఫరాల అధికారి జి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జిల్లాలో 14 లక్షల 40 వేల తెల్ల రేషన్ కార్డులుండగా వాటిలో సక్రమ రీతిలో 13 లక్షల 30 వేల మంది మాత్రమే రేషన్ సరుకులు తీసుకుంటున్నారన్నారు. మిగిలిన లక్షా 10 వేల మంది రేషన్‌కార్డుదారుల పరిస్థితి విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేశారు. 13 జిల్లాల్లోను ఎక్కడి నుండైనా తెల్లకార్డుదారులు తమ సరుకులను పోర్టబిలిటి విధానంలో తీసుకునే అవకాశం ఉందన్నారు. సరుకులు ఎవరికైనా తిరస్కరిస్తే సంబంధిత డీలర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వికలాంగులు, రేషన్ డిపోకు రాలేని వృద్ధులకు ‘ఇంటింటికి మీ-రేషన్’ పథకంలో నిత్యావసర వస్తువులను సంబంధిత రేషన్ డీలర్ ఇంటి వద్దే అందించే కార్యక్రమం ప్రారంభించనున్నట్టు తెలిపారు. వేలిముద్రలు సక్రమంగా పడటం లేదనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, వారి చేతి వేలిముద్రలను సేకరించే కార్యక్రమం ఈ నెల 28వ తేదీలోగా సంబంధిత రేషన్ డీలర్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏ ఒక్క వేలిముద్ర సరిపోయినా, ఆధార్ నెంబర్‌తో సరిచూసుకుని రేషన్ సరుకులను అందించే ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి నెలా విధిగా 1వ తేదీ నుండి 7వ తేదీ లోపల రేషన్ సరుకులను రేషన్ కార్డుదారులు అందుకోవాలని డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రామచంద్రపురం పట్టణంలోనూ, మండపేట పట్టణంలోనూ వేలిముద్రలను సేకరించే కార్యక్రమ పర్యవేక్షణను డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావు గురువారం నిర్వహించారు. ఆయన వెంట ఎమ్‌ఎస్‌ఒలు సుబ్బారావు, గాంధీ, పట్నాయక్‌తో పాటు ఎఎస్‌ఒ బాలకృష్ణ తదితరులున్నారు.