తూర్పుగోదావరి

స్నానఘట్టాలను పరిశీలించిన డిఐజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఏలూరు రేంజి డిఐజి రామకృష్ణ గురువారం మధ్యాహ్నం కోటిలింగాలరేవు నుంచి ధవళేశ్వరంలోని రామపాదాలరేవు వరకు ఉన్న ప్రధాన ఘాట్లను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ బి రాజకుమారిని ఆరా తీశారు. కోటగుమ్మం, ఇతర అనుసంధాన ప్రాంతాలను ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు. అంత్య పుష్కరాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యాత్రికుల రాకపోకలకు విడివిడిగా మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. యాత్రికుల రద్దీని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వాచ్‌టవర్లు ఏర్పాటు చేయాలన్నారు. వరదలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమయాల్లో యాత్రికులను రక్షించేందుకు గోదావరిలో పోలీసు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే మెష్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీలు జె కులశేఖర్, శ్రీకాంత్, రామకృష్ణ తదితరులు ఆయన వెంట ఉన్నారు.