తూర్పుగోదావరి

పార్టీలకు స్థలాలపై చిత్రమైన జిఒ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, జూలై 22: రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో స్థలాలు కేటాయించడం కోసం చంద్రబాబు సర్కార్ చిత్రమైన జీవోను తెచ్చిందని విమర్శించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ జీవో మాటున టిడిపి తమ పార్టీకి పెద్ద ఎత్తున భూములు కేటాయింపు చేసుకునే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు. అసెంబ్లీలో సంఖ్యా బలాన్ని బట్టి స్థలాలను కేటాయించడం హాస్యస్పదమని, ఇది ఏ రకంగా శాస్ర్తియమో తెలిపాలని డిమాండు చేశారు. టిడిపి సర్కార్‌కు భూములపై ఉన్న ప్రేమ.. పేద ప్రజలకు ఇళ్లు కట్టించే విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రోషనల్ సబ్ డివిజన్ క్లాజ్ వల్ల భూవివాదాలు వస్తాయని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 271ను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిచో పునరాలోచించాలని కన్నబాబు డిమాండ్‌చేశారు.
గడపగడపకు వైసిపి
గడపగడపకు వైసిపి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. 1వ డివిజన్‌లోని సమీదు, మార్కెట్, బోట్‌క్లబ్, రమణయ్యపేట ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కన్నబాబు తెలిపారు. స్మార్ట్ సిటీగా కాకినాడను తామే ఎంపికచేసినట్లు చెబుతున్న టిడిపి నాయకులు సమస్యలు తెలుసుకోవడంలో విఫలం చెందారన్నారు. కాకినాడలో ఉన్న సమస్యలు టిడిపి నాయకులు చూడాలని చెప్పారు. ఎటుచూసినా పందలు, మురికి నీరు, రోడ్లపై గుంతలు, వీధిలైట్లు వెలగకపోవడం ఇలా అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్‌విజె కుమార్, వాసిరెడ్డి సూరిబాబు, ఎల్లబోయిన చిన్నా, రావూరి వెంకటేశ్వరరావు, లింగం రవి, కోమటి సత్యనారాయణ, ఎం లక్ష్మి, గోపిశెట్టి బాబ్జి, కడియాల చిన్నా, చొక్కా జగన్, నందిపాటి అజయ్ తదితరులు పాల్గొన్నారు.