తూర్పుగోదావరి

అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూలై 22: అందరి భాగస్వామ్యంతో బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ కోరారు. సామర్లకోట టిటిడిసి జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో గ్రామాలను స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిధిలో ఎంపిక చేసిన 333 గ్రామాలకు చెందిన ఎంపిడిఒలు, ఇవోపిఆర్డీలు, సర్పంచ్‌లకు మూడు రోజులు ఇవ్వనున్న శిక్షణా తరగతులను శుక్రవారం జడ్పీ సిఇవో కె పద్మ అధ్యక్షతన ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ నామన మాట్లాడుతూ మూడు రోజులు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుని, తొలివిడతగా ఎంపిక చేసిన 333 గ్రామాలను ఒడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రానున్న మూడు సంవత్సరాల్లో జిల్లాను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా తయారు చేయడానికి అందరు కృషి చేయాలన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కేవలం ఈ స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించి ఇస్తే సరిపోదని, వాటి వినియోగం, వినియోగించకపోవడం, బహిరంగ మల విసర్జన వల్ల వచ్చే ఇబ్బందులపై నేరుగా అవగాహన కల్పించాలని సూచించారు. నూరు శాతం ఎస్‌ఎల్ గ్రామాల తయారీపై సర్పంచ్‌లు సవాలుగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలన్నారు. 2019 నాటికి తూర్పుగోదావరి జిల్లా బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా రూపొందించేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నీరు అంతగా లేని రాజస్థాన్‌లో బికనీర్ జిల్లా బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా గుర్తింపు పొందినట్లు కలెక్టర్ చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తయారు కాబోతున్నట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లజర్ల మండలాన్ని ఇప్పటికే అధికారులు బహిరంగ మల విసర్జన లేని మండలంగా ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ నుండి విచ్చేసిన యునిసెప్ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వరరావు, డ్వామా పిడి అయితే నాగేశ్వరరావు, ఎస్‌ఇజెడ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోరా జయరాజ్, యూనిసెప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.