తూర్పుగోదావరి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీలకు ఇసుకను లోడ్ చేయలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, మార్చి 26: మండల పరిధి జొన్నాడ ఇసుక ర్యాంపు రోజుకొక వివాదంతో తవ్వకాలు నిలిచిపోతున్నాయి. ట్రాక్టర్లకు లోడింగ్‌ను జొన్నాడకు చెందిన శాండ్ సొసైటీ నిర్వహిస్తుండగా, కొత్తగా లారీలకు కోరుమిల్లి, కపిలేశ్వరపురం నుండి సుమారు యాభై మంది కూలీలు నిబంధనలు ప్రకారం అంగీకార పత్రం ఇచ్చి ఎగుమతులు సాగిస్తున్నారు. అయితే అంగీకార పత్రాలు ఇచ్చిన యాభై మందికి తోడుగా మరో యాభై మంది కూలీలు అధికారులకు తెలియకుండా ఎగుమతులు సాగిస్తూ, గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు తవ్వకాలు నిర్వహించడంతో స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ర్యాంపును నిశితంగా పరిశీలించగా అక్కడ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించి వారిని హెచ్చరించడంతో ఇలాగైతే లారీలకు ఎగుమతులు చేయలేమంటూ శనివారం ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. దీంతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కూలీలతో తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరావు, ఎంపిడిఒ నాతి బుజ్జి, ఎస్సై శేఖర్‌బాబులు చర్చలు జరిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై పిడి యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో లారీ ఎగుమతి కూలీలు ఎగుమతులు చేయలేమంటూ వెళిపోయారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం నుండి పూర్తిగా లారీలకు ఎగుమతులు నిలిచిపోయాయి. అప్పటికే ర్యాంపు వద్ద భారీ స్థాయిలో లారీలు బారులు తీరి ఉండడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా లారీలకు ఎగుమతులకు సంబంధించి 5 యూనిట్లకు రూ.2,300ల నుండి రూ.5 వేలు అదనంగా వసూలు చేస్తున్నారని, రెండు యూనిట్లకు రూ.3 వేలు వసూలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఇసుక లోడింగ్‌లో స్థానిక నాయకుల హవా ఉండడంతో కాకినాడ వంటి దూర ప్రాంతాలకు మాత్రమే లోడింగ్ చేయాలని వారు సిండికేట్‌గా ఏర్పడి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉన్నవారికి ఇసుకను లోడింగ్ చేయకపోవడంతో తరచు వివాదాలు జరిగేవని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అలాగే లోడింగ్‌కు అధిక మొత్తాన్ని కూలీలు వసూలు చేస్తూ బయటకు చెప్పవద్దంటూ స్థానిక సిండికేట్ నాయకులు డ్రైవర్లకు హుకుం జారీచేయడంతో అధికంగా ఇచ్చిన డబ్బులకు లారీ యజమానులకు ఏ విధంగా చెప్పాలని డ్రైవర్లు లబోదిబోమంటున్నారు.