తూర్పుగోదావరి

ఆధ్యాత్మిక ఝరి.. పులకిరచిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది ఒడ్డు ఒక ప్రకృతి రమణీయ దృశ్యం.. ఆ దృశ్యాల మధ్య సెల్ఫీ స్నానాలతో యువత కేరింతలు కొడుతోంది. గోదావరి నది వరద జలాల ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. దీంతోపాటు భక్త జనంలో భక్త్భివం ఉరకలేస్తోంది. గోదావరి గల గలల మధ్య తీరమంతా అంత్య పుష్కర శోభాయమానంలో పుణ్య స్నానాలతో పునీతమవుతున్న భక్తజనం పుణ్య స్నానాల మధురానుభూతిని సెల్ఫీలతో బంధిస్తున్నారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తజనం అంత్య పుష్కర స్నానాలను స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరిస్తూ మధుర స్మృతిగా పదిలపర్చుకుంటున్నారు. ఎక్కువగా యువత సెల్ఫీల్లో ఒడ్డున దృశ్యాలను తీసుకోడడం కన్పించింది. ఒకవైపు జల్లు స్నానాలను కూడా సెల్ఫీలు దిగుతూ సెల్ఫీ రాజాలవుతున్నారు. యువతలో స్మార్ట్ ఆసక్తి కన్పిస్తోంది. గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఒక్కసారిగా స్నాన ఘట్టాల వద్ద నీటి మట్టం పెరగడంతో గురువారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజి వద్ద అన్ని గేట్లను ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి నదిలో వరద జలాలు వచ్చినవి వచ్చినట్టుగానే దిగువకు విడిచిపెట్టడంతో అఖండ గోదావరి నది రాజమహేంద్రవరం పరిధిలో వున్న కొన్ని ఘాట్లలో స్నానాలు ఆచరించేందుకు ఇబ్బంది తలెత్తడంతో నదిలో మళ్ళీ బారికేడింగ్ మార్చారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అత్యధికంగా యాత్రికులు వచ్చారు. అక్కడక్కడా ఒడిస్సా యాత్రికుల రాక మొదలైంది. రానున్న రోజుల్లో అత్యధికంగా ఒడిస్సా యాత్రికులు వచ్చేందుకు అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. స్థానికంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వైద్యశిబిరాలు అత్యధికంగా ఏర్పాటుచేసి ఉచితంగా మందులు కూడా సరఫరా చేస్తున్నారు. ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే వైద్యపరంగా అన్ని చర్యలు చేపట్టారు. అంత్య పుష్కరాలు సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను కూడా అత్యధికంగా వినియోగించుకుంటున్న వైనం కన్పిస్తోంది. టూరిస్టు బస్సులో వచ్చే యాత్రికుల కోసం ఇటు వేమగిరి, అటు గామన్ బ్రిడ్జి సమీపంలో దివాన్ చెరువు 16వ నెంబర్ జాతీయ రహదారి జంక్షన్‌లోనూ ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అవసరమైన వైద్య సేవలు పొలిమేర్లలోనే అందించే విధంగా చర్యలు చేపట్టారు. కోటిలింగాల ఘాట్‌లో గురువారం పిండ ప్రదాన క్రతువులు పెరిగాయి. కోటిలింగాల ఘాట్‌లో పిండ ప్రదాన రద్దీ కన్పిస్తే పుణ్య స్నానాల రద్దీ పుష్కర ఘాట్‌లో అత్యధికంగా కొనసాగింది. సరస్వతి ఘాట్, గౌతమీ ఘాట్, మిగిలిన మార్కండేయ ఘాట్, టిటిడి, శ్రద్ధానంద, పద్మావతి ఘాట్లలో రద్దీ అంతగా కన్పించలేదు. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు సడలించడంతో స్నాన ఘట్టాల వద్ద వాహన రద్దీ పెరిగింది. గౌతమీ ఘాట్ సమీపంలో గోదావరి ఒడ్డున ఆలయాల సముదాయంలో అంత్య పుష్కర ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. అత్యధికంగా భక్తజనం ఈ ఆలయాలను దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు, యజ్ఞ యాగాదుల నిర్వాహకులు భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేస్తున్నారు. సరస్వతి పీఠాన్ని, దత్త పీఠాన్ని, గాయత్రి పీఠాన్ని భక్తులు విశేషంగా దర్శించుకుంటున్నారు. ఇస్కాన్ టెంపుల్, అమ్మ భగవాన్ క్షేత్రాన్ని, మళయాళ స్వామివారి గీతా జ్ఞాన మందిరాన్ని భక్తులు దర్శించుకోవడం కన్పించింది. దత్త పీఠంలో లక్ష దత్త హోమం, మళయాళ స్వామి గీతా జ్ఞాన మందిరంలో చాతుర్మాస మహావ్రతం నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ఐదవ రోజు నదిలో శ్రావణ మాస శోభ కన్పించింది.