హైదరాబాద్

మెట్రో రెండో దశలో 5 కారిడార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

155 కి.మీ. మార్గంలో పరుగు
మియాపూర్-పటాన్‌చెరు వరకు విస్తరణ
ఎల్బీనగర్-హయత్‌నగర్, నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు
తార్నాక- ఇసిఐఎల్ క్రాస్‌రోడ్డు కారిడార్లకు ప్రతిపాదనలు
శివార్ల ట్రాఫిక్‌కు ముందస్తు పరిష్కారం

హైదరాబాద్, డిసెంబర్ 18: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న రద్దీ,ట్రాఫిక్ నుంచి నగరవాసులకు ఉపశమనం కల్గించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు కారిడార్ల మెట్రోరైలు పనులు చురుకుగా సాగుతున్న సంగతి తెలిసిందే! ఇందులో కారిడార్ 3,1లో ఇప్పటికే ఎనిమిది, పది కిలోమీటర్లలో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే! తాజాగా తెలంగాణ డిప్యూటీ సిఎం, మంత్రులు మెట్టుగూడ నుంచి ఉప్పల్ వరకు మెట్రోస్టేషన్ ప్రయాణించి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మరో ఆర్నెల్లలో నగర ప్రజలకు కూడా రైలు అందుబాటులోకి రానుంది. ఒకవైపు మొదటి దశ మూడు కారిడార్లలో మెట్రోరైలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే, రెండో దశగా పది శివారు ప్రాంతాలను కలుపుతూ అయిదు కారిడార్లుగా 155కి.మీ.ల మేర మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు ఇప్పటికే ఫీజిబిలిటీ అధ్యయాన్ని కూడా పూర్తి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్ నగరంలో మరిన్ని బహుళ జాతి కంపెనీలు, విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించేందుకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సర్కారు పెట్టుబడులతో పాటు రేపు ఇక్కడ కంపెనీలు నెలకొల్పితే వారికి తగిన సౌకర్యాలు కల్పించే అంశంపై కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఇందుకు గాను నగరం చుట్టూ నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాలకు కూడా మెట్రోరైలు ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.
తాజా ప్రతిపాదనలివి
ఈ క్రమంలో ఇప్పటికే కారిడార్ 1ను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఏర్పాటు చేస్తుండగా, దీన్ని మియాపూర్ నుంచి 13 కి.మీ.ల పొడువున పటాన్‌చెరు వరకు విస్తరించనున్నారు. అలాగే ఎల్బీనగర్ వరకున్న కారిడార్ 1ను హయత్‌నగర్ వరకు 7కి.మీ.లు, , నాగోల్ వరకున్న కారిడార్ 3ను అక్కడి వరకు ముగించి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 28కి.మీలు, అలాగే శిల్పారామం, గచ్చిబౌలీ, రాయదుర్గం మీదుగా శంషాబాద్ ఎయర్‌పోర్టుకు 28కి.మీ.లు, తార్నాక నుంచి ఇసిఐఎల్ క్రాస్‌రోడ్డు వరకు 7కి.మీ.లతో మొత్తం 83 కిలోమీటర్లతో అయిదు కారిడార్లను నిర్మించేందుకు సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఈ రెండో దశ మెట్రో పనులను కూడా ఎల్ అండ్ టి కన్సార్టియంకు అప్పగిస్తారా? లేక మళ్లీ తాజాగా టెండర్లు చేపట్టాలా? అన్న విషయంపై సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ముందుచూపుతో..
గచ్చిబౌలీ, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో మరిన్ని కొత్త ఐటి, బహుళజాతి కంపెనీలు నెలకొల్పేందుకు సర్కారు అనుమతులు జారీ చేయటంతో పాటు బహుళ అంతస్తు భవనాల నిర్మాణం కోసం కంపెనీ యాజమాన్యాలు జిహెచ్‌ఎంసికి అనుమతి కోసం దరఖాస్తులు కూడా చేసుకున్నాయి. అతి త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ సంస్థలకు నగరంలో నెలకొన్న ట్రాఫిక్ నుంచి ఎలాంటి కష్టాలు ఎదురుకారాదన్న ఉద్దేశ్యం సర్కారుది. అందుబాటులో ఉన్న పలు కంపెనీలతో పాటు కొత్తగా అందుబాటులోకి రానున్న మరిన్ని కంపెనీల ప్రతినిధులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాయదుర్గం వరకు మెట్రోరైలు కారిడార్‌కు సర్కారు అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి ఫీజుబిలిటీ అధ్యయనం పూర్తయిన తర్వాతే అధికారులు ప్రతిపాదనలను తయారీ చేస్తున్నట్లు తెలిసింది.