హైదరాబాద్

తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఎమ్మెల్యే గాంధీ విమర్శ
కెపిహెచ్‌బి కాలనీ, నవంబర్ 27: ఇంటింటికీ తాగునీరు ఇస్తామని ప్రగల్భాలు పలికిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం నీరందించడంలో పూర్తిగా విఫలమైందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని వివేకానందనగర్, హైదర్‌నగర్ డివిజన్‌లలో పాదయాత్రలో మంచినీటి ఎద్దడిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, కనీస అవసరాల నిమిత్తం కూడా నీరు కరవైందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కృష్ణ, గోదావరి జలాలను హైదరాబాద్‌కు సకాలంలో తీసుకురావడంలో విఫలమైందని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అరకొర నీటి సరఫరాతో సామాన్యుడు అతికష్టంగా జీవనం గడుపుతున్నాడని వారానికోకసారి కూడా నీళ్లు అందించలేని పాలకులు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని హేళన చేశారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మభ్యపెట్టేవిధంగా నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారే తప్పా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు.